పాలకవీడు మండలంలోని జాన్పహాడ్ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు కార్పొరేట్ స్కూళ్లను తలపిస్తున్నాయి. దాతల ఔదార్యంతో ఏర్పాటైన ఈ పాఠశాలలు విశాలమైన 4 ఎకరాల ప్రాంగణంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రకృతి వనాన్ని తలపిస్తున్నాయి. 2008సంవత్సరంలోనే ఆంగ్ల మాధ్యమం ప్రారంభించగా.. ఏటా విద్యార్థుల అడ్మిషన్లు పెరుగుతున్నాయి. పాఠశాలలో చదువుకున్న ఎంతో మంది నేడు ఉన్నతస్థానాల్లో స్థిరపడ్డారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే మారుమూల, అత్యంత నీటి ఎద్దడి ప్రాంతంగా ముద్రపడిన జాన్పహాడ్ గ్రామంలో 1958లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఏర్పాటైంది. 1996లో ఉన్నత పాఠశాలగా అప్గ్రేడ్ చేయడంతో గ్రామానికి చెందిన ముని శ్రీలక్ష్మీనర్సింహారావు 4ఎకరాల స్థలం విరాళం ఇచ్చారు. దాంతో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు ఏర్పాటై పేద, గిరిజన విద్యార్థులకు విద్య చేరువైంది.
జాన్పహాడ్ ఉన్నత పాఠశాలలో 2008 సంవత్సరంలో ఇంగ్లిష్ మీడియం తరగతులు ప్రారంభించారు. అందుబాటులో వున్న ఉపాధ్యాయులే తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో సబ్జెక్టు బోధిస్తున్నారు. ప్రస్తుతం 8 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. 7 తరగతి గదులు ఉన్నాయి. గతేడాది 153 మంది విద్యార్థులు ఉండగా.. ప్రస్తుతం 203 మంది చదువుతున్నారు.
తరగతి గదుల్లో ఫ్యాన్లు, డ్యుయల్ బెంచీలు ఇంగ్లిష్ మీడియం, ల్యాబ్, గ్రంథాలయం 2008లోనే ఇంగ్లిష్ మీడియం ఏర్పాటు 200కు పైగా మొక్కలతో అల్లుకున్న పచ్చదనం పాలకవీడు మండలంలోని జాన్పహాడ్ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు కార్పొరేట్ స్కూళ్లను తలపిస్తున్నాయి. దాతల ఔదార్యంతో ఏర్పాటైన ఈ పాఠశాలలు విశాలమైన 4
ఎకరాల ప్రాంగణంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రకృతి వనాన్ని తలపిస్తున్నాయి. 2008సంవత్సరంలోనే ఆంగ్ల మాధ్యమం ప్రారంభించగా.. ఏటా విద్యార్థుల అడ్మిషన్లు పెరుగుతున్నాయి. పాఠశాలలో చదువుకున్న ఎంతో మంది
నేడు ఉన్నతస్థానాల్లో స్థిరపడ్డారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే మారుమూల, అత్యంత నీటి ఎద్దడి ప్రాంతంగా ముద్రపడిన జాన్పహాడ్ గ్రామంలో 1958లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఏర్పాటైంది. 1996లో ఉన్నత పాఠశాలగా అప్గ్రేడ్ చేయడంతో గ్రామానికి చెందిన ముని శ్రీలక్ష్మీనర్సింహారావు 4ఎకరాల స్థలం విరాళం ఇచ్చారు. దాంతో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు ఏర్పాటై పేద, గిరిజన విద్యార్థులకు విద్య చేరువైంది.
జాన్పహాడ్ ఉన్నత పాఠశాలలో 2008 సంవత్సరంలో ఇంగ్లిష్ మీడియం తరగతులు ప్రారంభించారు. అందుబాటులో వున్న ఉపాధ్యాయులే తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో సబ్జెక్టు బోధిస్తున్నారు. ప్రస్తుతం 8 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. 7 తరగతి గదులు ఉన్నాయి. గతేడాది 153 మంది విద్యార్థులు ఉండగా.. ప్రస్తుతం 203 మంది చదువుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న‘మన ఊరు- మన బడి’లో భాగంగా జాన్పహాడ్, ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు మరింత అభివృద్ధి చెందనున్నాయి. రెండు పాఠశాలలూ తొలి విడుత జాబితాలో ఎంపిక కావడంతో గ్రామస్తులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
పాఠశాలను అన్ని విధాలుగా ఆదర్శంగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయ బృందం కృషి చేస్తున్నది. గ్రామస్తులు, ప్రజాప్రతినిధుల సహకారంతో జిల్లాలోనే నంబర్ వన్ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నాం. ప్రతి విద్యార్థిపై ప్రత్యేకంగా దృష్టి సారించి స్టడీ హవర్స్ నిర్వహిస్తున్నాం. మన ఊరు – మన బడి కార్యక్రమంలో మా పాఠశాల ఎంపిక కావడం సంతోషంగా ఉంది. సమష్టి సహకారంతో పాఠశాలను మరింత అభివృద్ధి చేస్తాం.
– శ్రీరాంరెడ్డి, ప్రధానోపాధ్యాయుడు
మా పాఠశాలలో విద్యార్థులకు కృత్యాధారిత విద్యను బోధిస్తున్నాం. సైన్స్ పట్ల ఆసక్తి రేకెత్తించేలా ప్రయోగాలు చేయిస్తున్నాం. సైన్స్ ల్యాబ్, లైబ్రరీని అందుబాటులో ఉంచాం. విద్యార్థులు చదువుతో పాటు ఆటపాటల్లోనూ రాణించేలా శిక్షణ ఇస్తున్నాం.
– శ్రీనివాస్, ఉపాధ్యాయుడు
పాఠశాలలో విద్యాబోధన కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా కొనసాగుతున్నది. దక్కన్ ఫ్యాక్టరీ యాజమాన్యం సహకారంతో తరగతి గదుల్లో ఫ్యాన్లు, డ్యుయల్ డెస్క్ బెంచీలు ఏర్పాటు చేశారు. విద్యార్థులకు ప్రయోగ పూర్వకమైన విద్యను అందించడానికి ప్రత్యేక ల్యాబ్, పఠనాసక్తి పెంపొందించడానికి ప్రత్యేకంగా లైబ్రరీ సౌకర్యం కల్పించారు. పదో తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా అదనపు తరగతులు, స్టడీ హవర్స్ నిర్వహిస్తున్నారు. దాతలు, పూర్వ విద్యార్థుల సహకారంతో పాఠశాలలో కళావేదిక నిర్మించారు.