తుర్కపల్లి, ఏప్రిల్ 16 : టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని మతాలకు సమాన ప్రాధాన్యం ఇస్తున్నదని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. తుర్కపల్లి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 64 ముస్లిం కుటుంబాలకు శనివారం ఆమె రంజాన్ గిఫ్ట్‌ప్యాక్‌లు అందించారు. అనంతరం 59మంది లబ్ధిదారులకు షాదీముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులను అందించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా అన్ని మతాల పండుగలను అధికారికంగా నిర్వహిస్తున్నది తెలంగాణ ప్రభుత్వమేనని ఆమె చెప్పారు. తుర్కపల్లి, ఏప్రిల్ 16 : సీఎం కేసీఆర్ పాలనలో సర్వమతాలకు సమ ప్రాధాన్యం ఇస్తున్నదని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. మండలకేంద్రంలోని జేఎం ఫంక్షన్హాల్లో శనివారం వివిధ గ్రామాలకు చెందిన 64 మంది ముస్లిం కుటుంబాలకు రంజాన్ గిఫ్ట్ప్యాక్లతోపాటు 59 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ముస్లింల అభ్యున్నతికి ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తుందన్నారు. మండలంలో 2016 నుంచి ఇప్పటివరకు వెయ్యి మందికి కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకం అందించిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. మండలంలో 1000 కుటుంబాలకు కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులు అందడంతో లబ్ధిదారులతో కలిసి ప్రభుత్వ విప్ కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ బీకూనాయక్, ఎంపీపీ సుశీలారవీందర్, పీఏసీఎస్ చైర్మన్ సింగిరెడ్డి నరసింహరెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ నర్సింహులు, వైస్ ఎంపీపీ శ్రీనివాస్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, ఆంజనేయులు, నవీన్‌కుమార్, రహమత్‌షరీఫ్, సర్పంచ్ వనితాశ్రీనివాస్, తాసీల్దార్ రవికుమార్, ఎంపీడీఓ ఉమాదేవి, ఎంపీటీసీలు కరుణాకర్, శ్రీనివాస్, మోహన్‌బాబు, శ్రీనివాస్, నాయకులు పాల్గొన్నారు.