
నల్లగొండ, ఆగస్టు 12 : పక్షం రోజుల నుంచి పత్తా లేని వాన గురువారం మధ్యాహ్నం చినుకులతో మొదలై రాత్రికి పలుచోట్ల దంచి కొట్టింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో చండూరు, నల్ల గొండ, మిర్యాలగూడ సహా పలుచోట్ల భారీ వర్షం పడింది. నల్లగొండ జిల్లాలోని మరో 20 మండలాల్లో మోస్తరుగా కురిసింది. నేల తడి లేక ఎండుముఖం పట్టిన మెట్ట పంటలకు తాజా వాన ఎంతో మేలు చేకూర్చ నున్నది. ఉక్కపోతతో అల్లాడుతున్న జనానికీ ఉపశమనం దొరికింది.
నల్లగొండ, ఆగస్టు 12 : నల్లగొండ జిల్లా వ్యాప్తంగా గురువారం భారీ వర్షం కురిసింది. నల్లగొండ, చండూరులో సుమారు గంటపాటు భారీ వర్షం కురవడంతో ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చండూరులో 54.3 మిల్లీమీటర్లు పడగా నల్లగొండలో 44.3 మి.మీ. వర్షం కురిసింది. గుండ్లపల్లిలో 27.8 మి.మీ, కనగల్‌లో 27.8, కొండమల్లేపల్లిలో 19.5, త్రిపురారంలో 16.5, నకిరేకల్‌లో 15.0, మిర్యాలగూడలో 12.5, చందంపేటలో 11.8, తిర్మలగిరి సాగర్‌లో 10.8, పెద్దవూరలో 10.0, నార్కట్‌పల్లిలో 7.8, నాంపల్లిలో 6.3, నేరేడుగొమ్ములో 4.3, పీఏపల్లిలో 3.3, దేవరకొండలో 3.0, కట్టంగూర్‌లో 3.0, మునుగోడులో 2.8, చింతపల్లిలో 0.5మి.మీ. వర్షం పడింది.
పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు
ప్రస్తుత నీటిమట్టం 589.50 అడుగులు
నీటి నిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలు
ప్రస్తుత నిల్వ 310.55 టీఎంసీలు
ఇన్ ఫ్లో 65,087 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో 51,254 క్యూసెక్కులు
జల విద్యుత్ కేంద్రం 33,008 క్యూసెక్కులు
ఎడమ కాల్వ 7,518 క్యూసెక్కులు
కుడి కాల్వ 7928 క్యూసెక్కులు
ఎస్ఎల్బీసీ 2,400 క్యూసెక్కులు
క్రస్ట్ గేట్ల నుంచి నిల్
నీటి సామర్థ్యం 45.77 టీఎంసీలు
ప్రస్తుత నిల్వ 28.11 టీఎంసీలు
ఇన్ ఫ్లో 35,808 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో 13,400క్యూసెక్కులు
నీటి సామర్థ్యం 4.46 టీఎంసీలు
ప్రస్తుత నిల్వ 2.89 టీఎంసీలు
ఇన్ ఫ్లో 1500 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో నిల్