హుజూర్నగర్ : హుజూర్నగర్ నియోజకవర్గంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా ఏడు మండలాల్లో పోలింగ్ జరుగుతోంది. మండలాల వారీగా ఓట్ల వివరాలు చూస్తే ఈ విధంగా ఉన్నాయి. గరిడేపల్లి మండలంలో 185, నేరేడుచర్ల మండలంలో 94, పాలక వీడు మండలంలో 95, మఠంపల్లి మండలంలో 22, మేళ్లచెరువు మండలంలో 34, చింతలపాలెం మండలంలో 21 ఓట్లు ఉన్నాయి.
హుజూర్నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 463 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అందుకుగాను మొత్తం 7 పోలింగ్ బూతులు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డివిజన్ వ్యాప్తంగా 89 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు.
తుంగతుర్తి మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ప్రశాంతంగా టీచర్ ఎమ్మెల్సీ పోలింగ్ కొనసాగుతోంది. ఈ మేరకు మండలవ్యాప్తంగా 54 మంది ఓటర్లకుగాను 45 మంది పురుషులు, 9 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ విధించి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.