
మెదక్ రూరల్, ఆగస్టు 18: శ్రావణం వచ్చిం ది.. శుభఘడియలు తెచ్చింది. శుభకార్యాలకు అనువైన సీజన్ వచ్చేసింది. ఆలయాలు, కల్యాణ మండపాలు, ఇంటి లోగిళ్లు అంతటా సందడి కనిపిస్తుంది. ముఖ్యంగా శ్రావణ మాసం ప్రారంభమవడంతో శుభకార్యాలు నిర్వహించేందుకు ప్రజాలంతా సిద్ధం కాగా, పెండ్లిండ్ల సీజన్‌లా మారింది. ఈ మాసంలో ఎక్కువ సంఖ్యలో ముహూర్తాలు ఉండటంతో సందడి నెలకొంది. అర్చకులు, పురోహితులు, ఫొటోగ్రాఫర్లు షామియనా నిర్వాహకులకు గిరాకీ ఎక్కువగా వస్తున్నది. ఈ నెల నుంచే పెండ్లి ము హూర్తాలు ఉండటంతో పెండ్లిండ్లు చేసేందుకు చేసేందుకు తల్లిదండ్రులు త్వరపడుతున్నారు. ఈ నెల 31 వరకు ముహూర్తాలు ఉండడంతో పెద్దసంఖ్యలో పెండ్లిండ్లు జరిగే అవకాశముంది. అక్టోబర్, నవంబర్‌లో కూడా మంచి ముహూర్తాలు ఉన్నాయిని పురోహితులు వెల్లడిస్తున్నారు.
శివకేశవులకు ప్రీతికరమైనది శ్రావణ మాసం. ఈ మాసంలో వేల సంఖ్యలో వివాహాలు జరుగుతా యి. ఈ నెల 9 నుంచి శ్రావణ మాసం ప్రారంభమైంది. పెళ్లీడుకొచ్చిన యువతీ యువకులకు వారి తల్లిదండ్రులు వివాహాలు చేసిందుకు ముందుగానే నిశ్చయించుకున్నారు.
కరోనాతో కళ తప్పిన వేదికలు మళ్లీ బాజాభజంత్రీల సందడితో కళకళలాడుతున్నాయి. కరోనా కారణంగా సుమారు ఐదారు నెలల పాటు వివాహాది శుభకార్యాలు వాయిదా పడుతూ వచ్చాయి. ప్రస్తు తం కొవిడ్ తగ్గు ముఖం పట్టడం. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రజాలంతా శుభకార్యాలు నిర్వహించుకుంటున్నారు. శ్రావణ మాసంలో మంచి రోజులు ఉండడం.. మళ్లీ శ్రీరామనవమి వరకు ముహూర్తాలు ఉండకపోవడంతో అందరూ ఇదే సీజన్లో శుభకార్యాలు కానిచ్చేస్తున్నారు. కల్యాణ మండపలను కూడా అడ్వాన్స్‌గా బుక్ చేసుకుంటున్నారు.
కరోనాతో చేతివృత్తులు వారు చాలా ఇబ్బంది పడ్డారు. కరోనా నిబంధనలు సడలించడంతో ఎప్పటిలానే శుభకార్యాలు జరుగుతున్నాయి. ఈ నెలలోనే అత్యధికంగా పెండ్లిండ్లు ఉండడంతో అన్ని రంగాల వారికి పని దొరుకుతుంది. దీంతో చిరు వ్యాపారులు, చేతి వృత్తుల వారు ఇతర వ్యాపారులు వారి వ్యాపారాన్ని సాగిస్తున్నారు. శ్రావణ మా సంలో పెండ్లిండ్లు జరుగుతుండటంతో షామియానా నిర్వాహకులు, ఫొటోగ్రాఫర్లు, పురోహితు లు, లైటింగ్ ఓనర్లు, ప్రింటింగ్ ప్రెస్, నిర్వాహకులు ఆనంద పడుతున్నారు. వివాహాలు జరుపుకునేందుకు కల్యా ణ మండపాలు, ముందుగానే రిజర్వు చేసుకున్నారు.
ఈ నెల 20, 21, 22, 25, 26, 27, 31 తేదీల్లో మంచి ముహూర్తాలున్నాయి. వీటిల్లో 14వ తేదీ స్వాతి, 16న అనురాధ, 18 ఏకాదశి, 21 శ్రావణ మూల, 25న ఉత్తరాభద్ర, 26న రేవతి నక్షత్రాలు కలిసిన ముహూర్తాలు ఉండడంతో ఆయా తేదీల్లో ఎక్కువ వివాహాలు జరిగే అవకాశం ఉంటుందని పండితులు చెబుతున్నారు. బాధ్రపద మాసంలో సెప్టెంబర్ 2 నుంచి అక్టోబర్ 5 వరకు శుభ ముహూర్తాలు లేకపోవడంతో వివాహాలు చేయరని పురోహితులు పేర్కొంటున్నారు. తిరిగి అక్టోబర్ 7, 8, 10, 15, 16, 17, 20, 21, 23, 24, 31 ము హూర్తాలున్నాయి. నవంబర్ (కార్తీక మాసం) లో 6, 10, 12, 13, 17, 20, 21 తేదీలు, డిసెంబర్ (మార్గమాసం)లో 5, 8, 9, 10, 12, 17, 18, 19, 24 తేదీల్లో శుభ ముహూర్తాలు అనుకూలంగా ఉన్నాయి.
మళ్లీ మంచి రోజులు వచ్చాయి. ఈ నెలం తా మంచి ముహూర్తాలున్నాయి. వివాహాది శుభకార్యలు జరుపుకోవచ్చు. కరోనాతో రెండేండ్లుగా శుభకార్యలు తక్కువగా జరిగాయి. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టింది. ఈ నెల 31 వరకు బలమైన ముహూర్తాలు ఉండగా, పెద్ద సంఖ్యలో పెండ్లిండ్లు జరిగే అవకాశముంది. అక్టోబర్, నవంబర్‌లో కూడా మంచి ముహూర్తాలు ఉన్నాయి. కొవిడ్ నింబధనలు పాటిస్తూ కార్యాలు చేస్తున్నాం.
కరోనాతో పని లేక ఎంతో ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు కరోనా ఆంక్షాలు పోయాయి. పెండ్లిండ్ల సీజన్ కావడంతో చాలా సంతోషంగా ఉంది. శ్రావణ మాసంలో అధిక సంఖ్యలో పెండ్లిండ్లు ఉండటంతో ముందుగానే రిజర్వు చేసుకున్నారు. ఇప్పు డు ఎంతో బిజీగా పని చేసుకుంటున్నాం.