
కాలాన్ని కట్టిపడేసే అద్భుత సృష్టి ఫొటోగ్రఫీ. కాలం సాగిపోతున్నా.. గతకాలపు అనుభవాలు కళ్లెదుట సాక్షాత్కరించాలన్నా ఒక్క ఫొటోకే సాధ్యం. కదలాడే వాస్తవానికి, కళాత్మక జోడింపుతో ఉద్భవించే అద్భుతమది. వెలుగు చీకట్ల నడుమ తళుక్కుమనే వెన్నెలను సజీవంగా బంధించే ఛాయాచిత్రమది. గతస్మృతులు అద్దాలుగా.. వర్తమానానికి ప్రతిబింబాలుగా..భవిష్యత్ తరాలకు బాసటగా నిలిచే ఫొటోలను ‘క్లిక్’మనిపించే నేర్పరులే ఫొటోగ్రాఫర్లు. నేడు ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఫొటోగ్రాఫర్లకు అభినందనలు తెలుపుతూ.. ‘నమస్తే తెలంగాణ’ కెమెరా నుంచి జాలువారిన అద్భుత దృశ్యాలు మీ కోసం..