
మెదక్ రూరల్ ఆగస్టు 17 : ఎమ్యెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. మెదక్ మండలం రాజ్‌పల్లికి వెళ్లిన ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డికి ప్రేమలతాప్రకాశ్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు ఘనస్వాగతం పలికారు. పుట్టినరోజు సందర్భంగా టీఆర్ఎస్ నాయకుల సమక్షంలో ఎమ్మెల్సీ కేక్ చేశారు. అనంతరం రాజ్పల్లిలోని పెద్దమ్మగుడిలో ఆయన ప్రత్యేక పూజలు చేసి మొక్కలు నాటారు. ఖాజీపల్లి సర్పంచ్ స్వప్న ఎమ్మెల్సీని కలిసి రాఖీ కట్టారు. వైస్ ఎంపీపీ ఆంజనేయులు, ఎంపీటీసీ ప్రభాకర్, ఉపసర్పంచ్ నవీన్, టీఆర్ఎస్ నాయకులు ఎలక్షన్‌రెడ్డి.. ఎమ్మెల్సీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
మెదక్ మున్సిపాలిటీ, ఆగస్టు 17 : ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని మెదక్‌లోని ప్రభు త్వ డిగ్రీ కళాశాల ఆవరణలో కాంట్రాక్ట్ లెక్చరర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వినోద్‌కుమార్ ఆధ్వర్యంలో అధ్యా పకులు మొక్కలు నాటారు.
ఎమ్మెల్సీని సన్మానించిన
మెదక్ మున్సిపాలిటీ, ఆగస్టు 17 : జిల్లా కేంద్రంలోని వైస్రాయ్ గార్డెన్లో ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ విద్యుత్ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారి భాస్కర్ ఆధ్వర్యంలో సుభాశ్‌రెడ్డిని గజమాలతో సన్మానించారు. వేడుకల్లో సంఘం నాయకులు నర్సింగ్, సత్యనారాయణ, రమేశ్, నాగరాజు, అశోక్, ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు.
మెదక్ రూరల్, ఆగస్టు 17 : ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని మెదక్ మండలం మాల్కాపూర్ తండాలో సర్పంచ్ సరోజామోహన్, జానకంపల్లిలో సర్పంచ్ శామవ్వ ఆధ్వర్యంలో టీఆర్ఎస నాయకులు 2 వేల మొక్కలు నాటారు.