
మెదక్, ఆగస్టు 17 : దళిత ఉద్యోగులపై చిత్తశుద్ధిని నిరూపించుకున్న ఏకైక సీఎం కేసీఆర్ అని, ప్రభుత్వ ఉద్యోగులకు దళితబంధు ఇస్తామని ప్రకటించడం హర్షనీయమని టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఉద్యోగులు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. సీఎం కేసీఆర్‌కు దళితులు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రాజ్‌కుమార్, సహ అధ్యక్షుడు ఎండీ సాధిక్ అలీ, కోశాధికారి బట్టి రమేశ్, ఉపాధ్యక్షురాలు గాండ్ల అనురాధ, ఉపాధ్యక్షులు మంగ మనోహర్, ఎండీ ఇక్బాల్ పాషా, ఫణిరాజ్, ఎండీ ఫజల్ ఉద్దీన్, మెదక్ యూనిట్ అధ్యక్ష, కార్యదర్శులు శివాజీ, రామాగౌడ్, జిల్లా సంయుక్త కార్యదర్శి రాధ, ప్రచార కార్యదర్శి చిరంజీవాచార్యులు, కార్యవర్గ సభ్యులు కిరణ్‌కుమార్, సంతోశ్, వెంకటేశ్, శ్రీకాంత్, హరికృష్ణ, పశు సంవర్ధక శాఖ జిల్లా కార్యదర్శి సలావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.