
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘దళితబంధు’ పథకానికి రెండు దశాబ్దాల క్రితం సిద్దిపేట నియోజకవర్గంలో చేపట్టిన ‘దళిత చైతన్యజ్యోతి’ కార్యక్రమమే స్ఫూర్తి. స్వయంగా ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ సోమవారం హుజూరాబాద్‌లో జరిగిన సభలో ప్రస్తావించారు. అప్పట్లో సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే కేసీఆర్ నంగునూరు మండలం మగ్దుంపూర్, చిన్నకోడూరు మండలం రామునిపట్ల, దుబ్బాక మండలం రాజక్కపేట, ఎల్లాపూర్ గ్రామాల్లో దళిత చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు. దళిత వాడల్లో అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించారు. దళితులను సంఘటితం చేసి వారికి ట్రాక్టర్లు, క్రేన్లు ఇప్పించి సామూహికంగా బావుల తవ్వకం, వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు. ఇండ్లు కట్టుకునేలా ప్రోత్సహించారు. శ్రమదానాలు చేసి రోడ్లు వేయించారు. ఇలా ఎన్నో పనులు అప్పట్లో చేపట్టారు.
రామయంపేట, ఆగస్టు 16 : సీఎం కేసీఆర్ దళితుల అభ్యున్నతికి దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం మెదక్ ఎమ్మెల్యే హుజూరాబాద్‌కు వెళ్తూ రామాయంపేటలో విలేకరులతో మాట్లాడారు. దళితబంధు పథకాన్ని ప్రస్తుతం సీఎం కేసీఆర్ హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా నేడు ప్రారంభిస్తున్నారని, రాబోయే రోజుల్లో ఈ పథకాన్ని తెలంగాణ రాష్ట్రం మొత్తం వర్తింపజేస్తారని అన్నారు. దేశంలోనే అన్ని వర్గాలకు సముచిత స్థానాన్ని కల్పించడమే సీఎం ముఖ్య ఉద్దేశమని అన్నారు. రూ.50వేల లోపు ప్రభుత్వ రుణాలు ఉన్న రైతులకు సీఎం మాఫీ చేశారని తెలిపారు. ఎమ్మెల్యే వెంట రామాయంపేట మున్సిపల్ చైర్మన్ జితేందర్‌గౌడ్, ఏఎంసీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, పీఏసీఎస్ చైర్మన్ చంద్రం ఉన్నారు.
మెదక్ మున్సిపాలిటీ/ నిజాంపేట, ఆగస్టు 16 : దళితులు ఆరిక్థ స్వావలంబన సాధికారతే లక్ష్యంగా తెలంగాణ దళితబంధు పథకాన్ని హుజూరాబాద్‌లో సీఎం కేసీఆర్ ప్రారంభించిన నేపథ్యంలో మెదక్ నియోజకవర్గం టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు 50కి పైగా వాహనాల్లో మెదక్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ర్యాలీగా తరలివెళ్లారు. ర్యాలీ ని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. తరలివెళ్లిన వారిలో మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, కౌన్సిలర్లు జయరాజ్, వసంత్‌రాజ్, మధు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గంగాధర్, టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీశ్, టీఆర్ఎస్వీ నాయకులు పరశురాం, నవీన్ నియోజకవర్గంలోని టీఆర్ఎస్, టీఆర్ఎస్వీ నాయకులు, ప్రజాప్రతినిధులు, దళిత నాయకులు ఉన్నారు. కాగా, నిజాంపేట నుంచి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఎంపీపీ సిద్ధిరాములు, పీఏసీఎస్ చైర్మన్ బాపురెడ్డి, రైతుబంధు మండల కో-ఆర్డినేటర్ సంపత్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు బాల్‌రెడ్డి సీఎం కేసీఆర్ సభకు తరలివెళ్లారు.
నర్సాపూర్ / కొల్చారం : దళిత బిడ్డల ఆర్థిక సాధికారతకే ‘దళితబంధు’ పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో సోమవారం సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో కార్యక్రమానికి నర్సాపూర్, కొల్చారం మండలాల టీఆర్ఎస్ శ్రేణులతో ఎమ్మెల్యే కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడారు. దళితుల బతుకుల్లో వెలుగులు నింపడానికే సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు.ఎమ్మెల్యే వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, మున్సిపల్ వైస్‌చైర్మన్ నయీమొద్దీన్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, పీఏసీఎస్ చైర్మన్ రాజు యాదవ్, టీఆర్ఎస్ నాయకులు అశోక్ గౌడ్, వెంకట్‌రెడ్డి, భిక్షపతి, నగేశ్, రావుఫ్, దావూద్, ఆంజనేయులు గౌడ్, కొల్చారం ఎంపీపీ మంజుల, మండల సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షుడు యాదాగౌడ్, సర్పంచ్‌లు నాగరాణి, వెంకట్‌గౌడ్, ఎంపీటీసీలు ఎల్లయ్య, ఉదయ వేమారెడ్డి, ఏఎంసీ మాజీ డైరెక్టర్ నాగేశ్వర్రావు ఉన్నారు.
వెల్దుర్తి, ఆగస్టు 16 : ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని హుజూరాబాద్‌లో ప్రారంభించిన నేపథ్యంలో వెల్దుర్తి, మాసాయిపేట మండలాల టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం హుజూరాబాద్‌కు తరలివెళ్లారు. ఎమ్మెల్యే వెంట టీఆర్ఎస్ ఉమ్మడి వెల్దుర్తి మండల అధ్యక్షుడు భూపాల్‌రెడ్డి, జడ్పీటీసీ రమేశ్‌గౌడ్, సర్పంచ్‌లు మధుసూదన్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, ఎంపీటీసీలు మోహన్‌రెడ్డి, నాయకులు నరేందర్‌రెడ్డి, ఆంజనేయులు, స్టేషన్శ్రీను, పాండురంగం, పవన్, రమేశ్ చందర్, మహేందర్‌రెడ్డి, గౌస్, నర్సింగరావు ఉన్నారు.
జహీరాబాద్/ న్యాల్కల్, ఆగస్టు 16 : హుజూరాబాద్‌లో నిర్వహించిన సీఎం కేసీఆర్ సభకు జహీరాబాద్ నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన టీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివెళ్లారు. హుజూరాబాద్‌లో సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు ఆధ్వర్యంలో కోహీర్, న్యాల్కల్, ఝరాసంగం, మొగుడంపల్లి, జహీరాబాద్ మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, దళిత సంఘాల నాయకులు తరలివెళ్లారు.
అందోల్, ఆగస్టు 16 : దళితబంధు ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ హుజూరాబాద్‌లో నిర్వహించిన సభకు అందోల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున్న టీఆర్ఎస్ శ్రేణులు తరలివెళ్లారు. ఎమ్మెల్యే వెంట అందోల్-జోగిపేట మున్సిపాలిటీతో పాటు అందోల్, వట్పల్లి, మునిపల్లి, రాయికోడ్, పుల్కల్, చౌటాకూర్, నర్సాపూర్ నియోజకవర్గంలోని హత్నూర మండలాల నుంచి మున్సిపల్, ఏఎంసీ చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు దళిత సంఘాల నాయకులు, టీఆర్ఎస్ శ్రేణులు ఉన్నారు.