
మెదక్, ఆగస్టు 15 : విధి నిర్వహణలో విశేష కృషి చేసిన 134 మంది అధికారులు, 17 మంది పోలీసు అధికారులకు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అవార్డులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. డీఆర్డీవో శ్రీనివాస్, డీపీవో తరుణ్, మైన్స్ ఏడీ జయరాజ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దేవయ్య, డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్రావు, జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ చంద్రశేఖర్, డీఎస్వో శ్రీనివాస్, లీడ్ బ్యాంక్ మేనేజర్ వేణుగోపాల్‌రావు, మెప్మా నుంచి సునీత తో పాటు 12 మంది రెవెన్యూ, 18 మంది పోలీసు, 5 మంది అటవీ శాఖ, 12 మంది వైద్య, ఆరోగ్య శాఖ, 13 మంది మున్సిపాలిటీ, 9 మంది జిల్లా పంచాయతీ విభాగం, ఐదుగురు డీఆర్డీఏ, ఆరుగురు సెర్ఫ్, ముగ్గురు మహిళా, శిశు సంక్షేమ శాఖ, 10 మంది వైద్య విధాన పరిషత్ నుంచి ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు అవార్డులతో పాటు ప్రశంసాపత్రాలను అందజేశారు. వ్యవసాయ శాఖ, యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా, ఉద్యానవన, విద్య, నీటి పారుదల, జైల్స్, చీఫ్ ప్లానింగ్, ఎస్సీ డెవలప్మెంట్, ఫైర్ సర్వీస్, రవాణా, పశు సంవర్ధక శాఖల నుంచి ఇద్దరేసి చొప్పున ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. అలాగే బీసీ అభివృద్ధి, సహకార శాఖ, పరిశ్రమల శాఖ, లీడ్ బ్యాంకు, మైనార్టీ, మిషన్ భగీరథ, గిరిజన సంక్షేమం, యువజన క్రీడలు, ఆరోగ్య శ్రీ, విద్యాశాఖ నుంచి ఒక్కొక్కరు చొప్పున విశిష్ట సేవలందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేశారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ ర్యాకల హేమలత, జిల్లా కలెక్టర్ హరీశ్, ఎస్పీ చందనదీప్తి, అదనపు కలెక్టర్లు రమేశ్, ప్రతిమాసింగ్, ట్రైనీ కలెక్టర్ అశ్వినితానాజీ వాకాడే, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, జడ్పీ చైర్పర్సన్ లావణ్యరెడ్డి, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వాతంత్య్ర సమరయో ధులు పాల్గొన్నారు.