
జడ్చర్ల, ఆగస్టు 12 : పల్లెప్రగతి పనులను త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సూచించారు. గురువారం జడ్చర్ల మండలంలోని కిష్టంపల్లి, నసరుల్లాబాద్ గ్రామాల్లో పర్యటించి పల్లెప్రకృతి వనం, సెగ్రిగేషన్ షెడ్లు, రైతువేదికలను పరిశీలించారు. కిష్టంపల్లిలో ప్రధా న రహదారికి ఇరువైపులా బహుళ వరుసల్లో మొక్కలు నాటే ప్రాంతాన్ని చూశారు. అదేవిధంగా నసరుల్లాబాద్లో అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. అనంతరం బృహ త్ పల్లె ప్రకృతివనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పల్లెల్లో ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు పెద్దఎత్తున మొక్కలు నాటి పెంచాలని సర్పంచులు, అధికారులకు సూచించారు. ప్రధానంగా పల్లెప్రకృతి వనాలను సుందరంగా తీర్చిదిద్దాలని తెలిపారు. జాతీయ రహదారులు, గ్రామాలకు వెళ్లే రోడ్లకు ఇరువైపులా మల్టీ లేయర్లో మొక్కలు నాటాల ని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో స్వరూప, సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రదాన కార్యదర్శి ప్రణీల్చందర్, కిష్టంపల్లి సర్పంచ్ రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.