
జడ్చర్ల, జనవరి 27 : బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో వేరుశనగ ధరలు తగ్గాయి. మంగళవారం క్వింటా రూ.7,232 ధర పలకగా గురువారం రూ.6,863 ధర వ చ్చింది. దాదాపు రూ.369 తగ్గింది. గురువారం బాదేపల్లి వ్యవసాయ మార్కెట్కు వే రుశనగ పెద్ద ఎత్తున అమ్మకానికి వచ్చింది. అలాగే వేరుశనగ, ధాన్యం, మొక్కజొన్న, కంది, పెబ్బర్లు, ఉలవలు కూడా విక్రయానికి వచ్చాయి. బాదేపల్లి వ్యవసాయ మార్కెట్కు 10,416 బస్తాల వేరుశనగ అమ్మకానికి రాగా క్వింటాకు గరిష్ఠంగా రూ.6,863 ధర, కనిష్ఠంగా రూ.3,868, మధ్యస్తంగా రూ.6,277 ధర వచ్చింది. మొక్కజొన్నలు 67 బస్తాలు రాగా క్వింటాకు గరిష్ఠంగా రూ.1,887, 71 బస్తాల ఆర్ఎన్ఆర్ ధాన్యం రాగా గరిష్ఠంగా రూ.1,919, కనిష్ఠంగా రూ.1,209, మధ్యస్తంగా రూ.1,209 ధర లభించింది. 95 బస్తాల హంస ధాన్యం రాగా క్వింటాకు గరిష్ఠంగా రూ.1,629, కనిష్ఠంగా రూ.1,367, మధ్యస్తంగా రూ.1,629, కంది 572 బస్తాలు రాగా గరిష్ఠంగా రూ.6,210, 2 బస్తాల పెబ్బర్లు విక్రయానికి రాగా గరిష్ఠంగా రూ.4,250 లభించింది.