
నేడు శ్రీకృష్ణ జన్మాష్టమి
పల్లె, పట్నంలో సాగనున్న ఉట్ల సంబురాలు
అలరించనున్న చిన్నారుల చిన్నికృష్ణుడి వేషధారణలు
ఆలయాలు సిద్ధం ఉమ్మడి జిల్లాలోఏర్పాట్లు పూర్తి
గండీడ్, ఆగస్టు 29 : శ్రావణ మా సాన్ని అత్యంత భక్తి భావంతో జ రుపుకొంటారు. ముఖ్యంగా ఈ మాసంలో శ్రావణ శుక్రవారా లు, వరలక్ష్మీ వ్రతాలతోపాటు మరో విశేషం కూడా ఉన్నది. భక్తి, జ్ఞానం, యోగం, మోక్షం గురించి ప్రపంచానికి తెలియజేసిన శ్రీకృష్ణ పరమాత్ముడు పుట్టిన శుభదినం కూడా ఈ మాసంలోనే ఉం టుంది. కృష్ణాష్టమిని కృష్ణజన్మనాష్టమి అని కూడా అంటారు. మంగళవారం గోకులాష్టమి సం దర్భంగా అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఉదయాన్నే లేచి స్నానమాచరించి, గు మ్మాలకు మామిడి తోరణాలు కట్టి, పసుపు కుంకుమలతో గడపలను పూజించి కృష్ణయ్యను ఇంటిలోకి ఆహ్వానిస్తూ శ్రీకృష్ణుడి పాదాలు వేస్తారు. ఈ రోజున పిల్లలను ఎంత గారాబంగా చూస్తామో అం త చక్కగా ముస్తాబు చేసి ఇంట్లోకి ఆహ్వానిస్తారు. చిన్నికృష్ణుడి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేసి ఆ తర్వా త గోరు వెచ్చని నీటితో అభిషేకం చేసి చక్కగా పట్టు వస్ర్తాలు కట్టి ఆభరణా లు పెట్టి అలంకరించాలి. స్వామికి తులసీ మాలని మెడలో వేయాలి. పారిజాత పూలమాల వేస్తే మం చిదని అర్చకులు చెబుతున్నారు. ఉట్టి సంబురాల ను ఘనంగా నిర్వహిస్తారు.