
అచ్చంపేట రూరల్/బల్మూరు, జనవరి 27 : నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూ రు మండలం బాణాల గ్రామానికి చెందిన నిమ్మల లాలమ్మ ప్ర సవం కోసం అచ్చంపేట ప్రభుత్వ ద వాఖానకు రాగా కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో నాగర్‌కర్నూల్ దవాఖానకు రెఫర్ చేయగా.. ఆరుబయటే ప్రసవించిన ఘటన విదితమే.. అయితే గురువారం ఈ విషయం తెలుసుకున్న గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ నేరుగా బాలింత లాలమ్మతో ఫోన్లో మాట్లాడారు. ఆరో గ్య పరిస్థితి ఎలా ఉన్నదని అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ కిట్ అందించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గవర్నర్ తమిళిసై, మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు నాగర్‌కర్నూల్ జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ శివరాం, వైద్యసిబ్బంది బాధితురాలి ఇంటికి వెళ్లి వైద్య పరీక్షలు చేశారు. కేసీఆర్ కిట్, పౌష్టికాహారం అందజేశారు. గోరువెచ్చని నీటిని తాగాలన్నారు. ప్రస్తుతం తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్న ట్లు వైద్యులు తెలిపారు. కార్యక్రమంలో వైద్యుడు రాజేశ్, ఆశ కార్యకర్తలు ఉన్నారు.