
డ్రగ్స్‌పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఈ క్రమంలో అమ్మకాలను అరికట్టే పనిలో ఎక్సైజ్ శాఖ నిమగ్నమైంది.ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బృందాలతో దాడులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 11 కేసులు నమోదు చేసి 14 మందిని అరెస్టు చేశారు. డ్రగ్స్కుబానిసైన వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. భవిష్యత్‌ను అంధకారం చేసుకోవద్దని హెచ్చరిస్తున్నారు.
మహబూబ్‌నగర్, జనవరి 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘రాష్ట్రంలో తీవ్రవాదాన్ని అరికట్టగలిగాం. ఈ విజయం వెనుక పోలీస్ శాఖ త్యాగాలున్నాయి. వారు చేసిన వీరోచిత పోరాటం ఉన్నది. దీంతో రాష్ట్రం గౌరవం, ప్రతిపత్తి ఎంతగానో పెరిగింది. ఒక వైపు రాష్ట్రం గొప్ప అభివృద్ధిని సాధిస్తున్న తరుణంలో గంజాయి వంటి మాదక ద్రవ్యాల లభ్యత పెరగడం శోచనీయం. గంజాయి మాఫియాను అణిచివేయాలి..నేరస్తులు ఎంతటివారైనా ఉపేక్షించాల్సిన అవసరం లేదు..’ అని గతేడాది అక్టోబర్ 20వ తేదీన సీఎం కేసీఆర్ ఎక్సైజ్, పోలీస్ శా ఖలతో ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి సమావేశంలో అన్న మాటలు.. పోరాడి సాధించుకున్న తర్వాత రాష్ట్రం అభివృద్ధి పథాన వెళ్తుంటే గంజాయి వంటి మాదక ద్రవ్యాలతో యువత చెడు మార్గంలో పయనించడం రాష్ర్టానికి ఏ మాత్రం శ్రేయస్క రం కాదని సీఎం స్పష్టం చేశారు. ఈ పీడను త్వరగా తొలగించకపోతే మనం సాధిస్తున్న విజయాలు, వాటి ఫలితాలు నిర్వీర్యమ య్యే ప్రమాదం ఉన్నదని, ప్రమాద ఘంటికలు మోగుతున్నాయనే విషయాన్ని పోలీస్, ఎక్సైజ్ శాఖాధికారులు తీవ్రంగా పరిగణించాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ రివ్యూ, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఉన్నత స్థాయి సమీక్ష తర్వాత రాష్ట్రంలో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయిం ది. గంజాయి, మాదకద్రవ్యాలు, గుట్కాపై పోలీసులు, ఎక్సైజ్ అధికారుల దాడులు పెరిగాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బృందాలు దాడులు ముమ్మరం చేశాయి. పెద్ద ఎత్తున గంజాయి, ఇతర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకుంటున్నారు. ఇప్పటివరకు 11 కేసుల్లో 14 మందిని అరెస్టు చేశారు. గంజాయి పెంచుతున్న ప్రదేశాలకు చేరుకొని ధ్వంసం చేశారు.
గంజాయి అమ్మకాలపై ఉమ్మడి జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. గంజాయి సాగు, సరఫరా, విక్రయాలు, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించి దాడులు చేస్తున్నారు. ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, డిప్యూటీ కమిషనర్ ఖురేషి ఆదేశాలతో క్షేత్రస్థాయిలో దాడులు ముమ్మరం చేశారు. కర్ణాటక, ఏపీ రాష్ర్టాల నుంచి వచ్చే గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలపైనా దృష్టి సారించారు. ఎక్సైజ్, పోలీస్, రెవెన్యూ, అటవీ శాఖాధికారులు సమన్వయంతో ముందుకు సాగుతున్నారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గంజాయి సాగు చేస్తున్న వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. హైదరాబాద్, బెంగళూరులో ఎంబీఏ, బీటెక్ వంటి ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థులు ఆన్లైన్ క్లాసుల వల్ల సొంతూళ్లకు వచ్చారు. వారు చదువుకుంటున్న ప్రదేశాల్లో గంజాయికి అలవాటుపడ్డారు. ఇక్కడా అదే పనిచేస్తున్నారని స్థానికులు, బంధువుల ఆధారంగా ఎక్సైజ్ అధికారులకు తెలిసింది. వారిని పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి అక్రమార్కుల సమాచారాన్ని తెలుసుకుంటున్నారు.
ముమ్మరంగా దాడులు..
ప్రజలు గమనించని ప్రాంతాల్లో మిర్చి, పత్తి సాగుతోపాటు గం జాయి సాగు చేస్తున్నారు. నల్లమలలో ఇలాంటి చోట్ల దాడులు కొనసాగుతున్నాయి. గంజాయి సేవిస్తున్న వారిని అదుపులోకి తీసుకొని.. వారిచ్చిన సమాచారం మేరకు సరఫరా చేసే అక్రమార్కులను పట్టుకుంటున్నారు. ఇప్పటివరకు మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో ఐదుగురిని అరెస్టు చేసి 39 గం జాయి మొక్కలు, 150 గ్రాముల గంజాయి పౌడర్, జోగుళాంబ గద్వాలలో రెండు కేసుల్లో నలుగురిని అరెస్టు చేసి 43 మొక్కలు స్వాధీనం చేసుకున్నారు. వనపర్తి జిల్లాలో ఒక కేసులో 150 గ్రాముల గం జాయి పౌడర్, ఒక బైక్‌తోపాటు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో మూడు కేసుల్లో 14 మొక్కలు, 2 కేజీల గంజాయి పౌ డర్ స్వాధీనం చేసుకొని ముగ్గురిని అరెస్ట్ చేశారు. జడ్చర్ల సెజ్ సమీపంలో ఇతర రాష్ర్టాల నుంచి గంజాయి వస్తుందనే సమాచారంతో ఎక్సైజ్ పో లీసులు నిఘా పెట్టారు. గంజాయి సేవించే వారు వాట్సాప్ గ్రూపుగా ఏర్పడి కోడ్ లాంగ్వేజ్ ద్వారా సరుకు తీసుకుంటున్నట్లు గుర్తించారు. వీరి ద్వారా ఎక్కడెక్కడ గంజాయి పండిస్తున్నారో సమాచారం సేకరించారు.
ముమ్మరంగా దాడులు..
ప్రజలు గమనించని ప్రాంతాల్లో మిర్చి, పత్తి సాగుతోపాటు గం జాయి సాగు చేస్తున్నారు. నల్లమలలో ఇలాంటి చోట్ల దాడులు కొనసాగుతున్నాయి. గంజాయి సేవిస్తున్న వారిని అదుపులోకి తీసుకొని.. వారిచ్చిన సమాచారం మేరకు సరఫరా చేసే అక్రమార్కులను పట్టుకుంటున్నారు. ఇప్పటివరకు మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో ఐదుగురిని అరెస్టు చేసి 39 గం జాయి మొక్కలు, 150 గ్రాముల గంజాయి పౌడర్, జోగుళాంబ గద్వాలలో రెండు కేసుల్లో నలుగురిని అరెస్టు చేసి 43 మొక్కలు స్వాధీనం చేసుకున్నారు. వనపర్తి జిల్లాలో ఒక కేసులో 150 గ్రాముల గం జాయి పౌడర్, ఒక బైక్‌తోపాటు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో మూడు కేసుల్లో 14 మొక్కలు, 2 కేజీల గంజాయి పౌ డర్ స్వాధీనం చేసుకొని ముగ్గురిని అరెస్ట్ చేశారు. జడ్చర్ల సెజ్ సమీపంలో ఇతర రాష్ర్టాల నుంచి గంజాయి వస్తుందనే సమాచారంతో ఎక్సైజ్ పో లీసులు నిఘా పెట్టారు. గంజాయి సేవించే వారు వాట్సాప్ గ్రూపుగా ఏర్పడి కోడ్ లాంగ్వేజ్ ద్వారా సరుకు తీసుకుంటున్నట్లు గుర్తించారు. వీరి ద్వారా ఎక్కడెక్కడ గంజాయి పండిస్తున్నారో సమాచారం సేకరించారు.
నేడు సీఎం కేసీఆర్ సమావేశం..
రాష్ట్రంలో మాదక ద్రవ్యాల (డ్రగ్స్) వాడకం అనేమాటే వినపడకుండా అత్యంత కఠినంగా వ్యవహరించాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రగతిభవన్‌లో స్టేట్ పోలీస్ అండ్ ఎక్సైజ్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. సమావేశానికకి హోం, ఎక్సైజ్ శాఖ మంత్రులు, సీఎస్, డీజీపీ, డీజీలు, అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లు, డీసీపీలతోపాటు రాష్ట్ర ఎక్సైజ్ పోలీస్ శాఖకు చెందిన ఎస్ఈలు హాజరుకానున్నారు. మాదక ద్రవ్యాల వినియోగంలో దోషులుగా తేలితే ఎంతటివారైనా సరే కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి ఆదేశించనున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఈ దందా చేయాలంటేనే అక్రమార్కులు హడలిపోయే పరిస్థితి రానున్నది. కఠిన చర్యల అమలు కోసం సమావేశంలో ప్రణాళికలు రూపొందించే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు వెయ్యి మందితో నార్కోటిక్ అండ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కంట్రోల్ సెల్ ఏర్పాటు చేసి మాదకద్రవ్యాలపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నది.
20 ఏండ్లపాటు జైలు శిక్ష..
మాదకద్రవ్యాల తయారీ, విక్రయాలు చేసే వారికి కేసుల తీవ్రతను బట్టి 20 ఏండ్లపాటు జైలు శిక్ష పడుతుంది. చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి. అక్రమార్కులు తమ దందాకు బ్రేకులు వేసుకోకుంటే జైలు ఊచలు లెక్కపెట్టక తప్పదు. జీవితాలు నాశనం అవుతాయని గుర్తుంచుకోవాలి. ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గంజాయి, నాటుసారా, ఇతర మాదకద్రవ్యాలపై దాడులు ముమ్మరం చేశాం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గంజాయికి అలవాటు పడిన కొందరిని అదుపులోకి తీసుకున్నాం. హైదరాబాద్ లో చదువుకుంటున్న స్థానికులే ఎక్కువగా ఉన్నారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చాం. దందా చేసే వారి సమాచారం సేకరించాం. డ్రగ్స్‌కు అలవాటు పడితే కెరీర్ నాశనం అవుతుందని విద్యార్థులు గమనించాలి. డ్రగ్స్‌కు అలవాటు పడిన వారిపై తల్లిదండ్రులు ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలి. దైనందిన కార్యక్రమాలు, ఫోన్ సంభాషణలపై నిఘా ఉంచాలి. అనుమానాస్పద వ్యక్తుల సమాచారం మాకు అందించాలి. సమాచారం ఇచ్చేవారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతాం.