
మహ్మదాబాద్, సెప్టెంబరు 20 : ఉ ద్యోగులకు సంఘాలతోనే భద్రత ఉంటుందని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో పీఆర్టీయూ టీఎస్ ఆధ్వర్యంలో స్వర్ణోత్సవ సంబురాలు, విద్యాసదస్సు నిర్వహించారు. ఈ సందర్భం గా మంత్రి మాట్లాడుతూ సత్ప్రవర్తన, మంచి నాయకత్వం, సంస్కృతి, సంప్రదాయాలకు ముఖ్య మార్గదర్శకత్వం వ హించేది విద్యావ్యవస్థే అని పేర్కొన్నారు. ఉపాధ్యాయ సమస్యల సాధనలో పీఆర్టీయూ ఎంతో కృషి చేస్తుందన్నారు. తె లంగాణ ఏర్పడక ముందు, వచ్చిన త ర్వాత అనేక మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. విద్యావ్యవస్థను పటిష్టం చేసేందుకు ముఖ్యమంత్రి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. విద్యార్థులు కడుపు కాలి అల్లాడే కాలం నుంచి కడుపు నిం డా భోజనాలు, ఉచితంగా పాఠ్య పుస్తకాలు, దుస్తుల పంపిణీకి చేరుకున్నామన్నారు. అడగకముందే అవుట్ సోర్సిం గ్, కాంట్రాక్టు, తదితర ఉద్యోగులకు 30 శాతం వేతనాలు పెంచి టీఆర్ఎస్ ప్రభు త్వం అండగా నిలిచిందన్నారు. ఎవరికి సమస్య వచ్చినా చేదోడువాదోడుగా ఉం టామన్నారు. ఉద్యోగులు శాఖల సమన్వయ లోపాలను గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే పరిష్కరించడానికి సు లువుగా ఉంటుందన్నారు. మంత్రి మా ట్లాడుతున్న సమయంలో మసీదులో ముస్లింలు ప్రార్థన చేస్తుండగా, హజాను గౌరవించి ప్రసంగాన్ని మధ్యలో ఆపివేశారు. హజాన్ అయిపోయిన తర్వాత మాట్లాడారు. అనంతరం ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యమ సమయంలో ఉద్యోగుల పాత్ర కీలకమైనదన్నారు. రాష్ట్ర ఏర్పడిన తర్వాత విద్యావ్యవస్థలో పాఠశాలలు బలోపేతమయ్యాయన్నారు. రాష్ట్రంలో మొదటిసారిగా పరిగిలో పీఆర్టీయూ భవనం నిర్మించినట్లు తెలిపారు. కుల్కచర్ల, పరిగిలో భవనాల నిర్మాణానికి కృషి చేయనున్నట్లు చెప్పారు. ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ పీఆర్టీయూ కార్యకర్తల కృషితో మొక్కలా ఉన్న సంఘం మహావృక్షంలా మారిందన్నారు. రాష్టంలోనే మొదటి స్వర్ణోత్సవ సంబురాలు నిర్వహించిన మహ్మదాబాద్ పీఆర్టీయూ శాఖను అభినందించారు. పీఆర్టీయూ పుస్తకావిష్కరణ అనంతరం రిటైర్డ్ ఉపాధ్యాయుడు కృష్ణారెడ్డి మంత్రిని సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ మాధవి, జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు గిరిధర్‌రెడ్డి, సర్పంచ్ పార్వతమ్మ, ఎంపీటీసీ చెన్నయ్య, హెచ్ఎం వెంకట్‌రెడ్డి, వైస్ ఎంపీపీ ఈశ్వరయ్య గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ రాధారెడ్డి, పీఆర్టీయు టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నారాయణగౌడ్, సభ్యులు రఘురాంరెడ్డి, విజయానంద్‌రెడ్డి, విజయ్‌కుమార్‌గౌడ్, జైపాల్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, విజయ్‌కుమార్, భీంరెడ్డి, రమేశ్, ఖాదర్, సుజాత, గీత, రత్నమాల తదితరులు పాల్గొన్నారు.