
ఆర్డీఎస్కు మహర్దశ పట్టనున్నది. ప్రధాన కాలువ మరమ్మతులకు సర్కారు అనుమతి నిచ్చింది. తుమ్మిళ్ల నుంచి నీటిని లిఫ్టు చేసి ఆర్డీఎస్ ప్రధాన కాలువలోకి ఎత్తిపోసే క్రమంలో నీటి ప్రవాహం కారణంగా కాలువలకు లైనింగ్ ఊడిపోవడంతోపాటు కోతకు గురవుతున్నాయి. ఈ విషయాన్ని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా.. మరమ్మ తులకు రూ.13.54 కోట్లు విడుదల చేసింది. నాలుగు విడుతల్లో పనులు చేపట్టేందుకు త్వరలో టెండర్లు ఆహ్వానించనున్నారు. ఈ పనులు పూర్తయితే కాలువలు బాగై నీరు సాఫీగా పరుగులు పెట్టనున్నది. కాగా నిధుల మంజూరుపై ఆయకట్టు అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మహబూబ్‌నగర్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆర్డీఎస్ ప్రాజెక్టుకు బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 15.90 టీఎంసీలను ఏనాడూ వాడుకునే పరిస్థితి ఉండేది కాదు. ఆయకట్టు ఎండిపోతుం టే రైతులు కళ్లప్పగించి చూసే దారుణమైన పరిస్థితి స మైక్య రాష్ట్రంలో నిత్యకృత్యంగా ఉండేది. ఆర్డీఎస్ చివ రి ఆయకట్టు రైతులకు సవ్యంగా సాగునీటిని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం తీసుకొచ్చి ఆదుకున్నది. అయితే, కాలువలు, డిస్ట్రిబ్యూటరీల మరమ్మతులతో ఉన్న ఇబ్బందులను తొలగించేందుకు రూ.13.54 కోట్లను విడుదల చే సింది. త్వరగా ఈ పనులు చేపట్టి రైతులకు మరింత బాగా సాగునీరందించేందుకు సర్కారు సిద్ధమైంది.
కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు 120 కి.మీ. ది గువన రాయిచూరు జిల్లా మాన్వి తాలూకా రాజోళి బండ వద్ద తుంగభద్ర నదికి ఆనకట్ట నిర్మించి తెలంగాణలోని 87,500 ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఆర్డీఎస్ ప్రాజెక్టు నిర్మించారు. అయితే, హెడ్ వర్క్స్ నుంచి కర్ణాటకలోనే కాలువ 42.60 కి.మీ. మేర ప్రవహిస్తుంది. దీంతో కర్ణాటకకు కేటాయించిన 1.20 టీఎంసీల కంటే అధికంగా నీటిని వినియోగించడంతో తెలంగాణలోని ఆయకట్టుకు సమస్య ఏర్పడింది. కర్ణాటక అనధికారికంగా కాలువపైనే మినీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసి నీటి చౌర్యానికి పాల్పడుతున్నది. దీంతో తెలంగాణలోని అలంపూర్ నియోజకవర్గంలో టెయిల్ ఎండ్ అయిన 143 కి.మీ. వరకు సాగునీటి ఊసే లేకుండా పోయింది. ఏ టా సాగునీటి కష్టాలు తప్పలేదు. సమైక్య రాష్ట్రంలో ఆర్డీఎస్ హెడ్ వర్క్స్ వద్ద రాయలసీమ గూండాలు స్లూయిస్‌లను ధ్వంసం చేసి తుంగభద్ర ద్వారా నీటిని కేసీ కెనాల్‌కు అక్రమంగా తరలించుకుపోయారు. అప్పటి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్, టీడీపీ నాయకులు మౌనంగా ఉండడంతో ఆర్డీఎస్ రైతులు ఆగమయ్యారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ వహించి తుమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంను ప్రారంభించారు. దీంతో సుంకేసుల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ నుంచి నీటిని లిఫ్ట్ చేసి ఆర్డీఎస్ ప్రధాన కాలువ 75 కి.మీ. వద్ద నీటిని ఎత్తిపోస్తూ రైతులకు సక్రమంగా సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.
ఎన్ని జీవితాలు
అమరత్వం పొందితేనో
ఎన్ని ప్రాణాలు
తృణప్రాయంగా త్యజిస్తేనో
మన దేశం మనకు
వశమై స్వేచ్ఛనివ్వలేదు.
ఎన్ని పోరాటాలు త్యాగచరితం అయితేనో
ఎన్ని దండయాత్రలు దండుగా కదిలితేనో
స్వాతంత్య్రం మనకు స్వరాజ్యమై వెలగలేదు.
ఆంగ్లపాలకుల దాష్టీకానికి
ఎదురొడ్డి నిలిచింది భారత పౌరుషం
వలస పాలకుల బానిసశృంఖలాలను
ఛేదించింది నవయవ్వన ప్రజానీకం.
అప్రతిహతంగా సాగిన అహింసామార్గం
ప్రపంచంలోనే ఆదర్శంగా నిలిచిన చిరస్మరణీయ ఘట్టం
ఉప్పు సత్యాగ్రహ మహోద్యమ పోరాటం
అఖిల భారతావనిని ఏకంచేసిన స్వాతంత్య్ర పోరాటం.
ఒక మహాసంగ్రామాన్ని తలపింపజేసిన
భారత సమరయోధుల సమరత్వం
జాతీయ ఉద్యమాలకు నాంది పలికిన
యువకిశోరాల ధృడమైన వీరత్వం.
మహోన్నత వందేమాతర నినాదం
దేశమంతటినీ ఒక్కటి చేసిన స్ఫూర్తి మంత్రం
చంపండి లేదా చావండి అన్న సందేశం
జాతిని జాగృతపరిచిన విజయకేతనం.
అమరుల త్యాగఫలమే నేటి స్వాతంత్య్రం
డెబ్బది ఏండ్ల అమృతోత్సవమే ఈ స్వరాజ్యం.