
హన్వాడ, ఆగస్టు 13 : త్వరలోనే రెండోవిడుత గొర్రెలు పంపిణీ చేస్తామని కలెక్టర్ వెంకట్రావు పేర్కొన్నారు. శుక్రవారం మండలకేంద్రంలో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు వేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 16వ తేదీవరకు నట్టల నివారణ మందు పంపిణీ గడువును పెంచినట్లు తెలిపారు. గొర్రెలు, మేకలకు తప్పనిసరిగా నట్టల నివారణ మందు తాగించాలని సూచించారు. జిల్లాలో రెండోవిడుత గొర్రెలు పంపిణీ చేసేందుకు పక్కా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. మొత్తం 17వేలమందికి గొర్రెలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఒక్కొక్కరికి 20 గొర్రెలతోపాటు ఒక పొట్టేలు ఇవ్వనున్నట్లు చెప్పారు. ప్రభుత్వం అందించిన గొర్రెలను లబ్ధిదారులు స ద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే జీవాలకు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ జేడీ మధుసూదన్గౌడ్, ఎంపీపీ బాలరాజు, ఎంపీడీవో ధనుంజయగౌడ్, తాసిల్దార్ శ్రీనివాసులు, యాదవ సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు రాజుయాదవ్, గంగాపూరి, సర్పంచ్ రేవతి, మండల పశువైద్యాధికారి మౌనికారెడ్డి, నాయకులు సత్యం, రమణారెడ్డి, యాదయ్య, నాగన్న, పెంటయ్య పాల్గొన్నారు.