
ఊర్కొండపేట అభయాంజనేయస్వామి రథోత్సవం మంగళవారం తెల్లవారుజామున వైభవంగా కొనసాగింది.బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రథోత్సవానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలొచ్చారు. రథాన్నిలాగేందుకు పోటీపడ్డారు. ఆలయ సమీపంలోని వేపచెట్టు కింద ఉన్న స్వామి గద చుట్టూ రథాన్ని ప్రదక్షిణలు చేయించాక తిరిగి ఆలయ ప్రాంగణంలోకి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా అంజన్న నామస్మరణ మార్మోగింది. జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి హాజరై రథాన్ని లాగారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వాహకులు చర్యలు చేపట్టగా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
ఊర్కొండ, ఫిబ్రవరి 1 : మండలంలోని ఊర్కొండపేట అభయాంజనేయస్వామి రథోత్సవం మంగళవా రం తెల్లవారుజామున వైభవంగా కొనసాగింది. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన ఈ వేడుకను తిలకించేందుకు ఊర్కొండ, ఊర్కొండపేటతోపాటు వివిధ ప్రాం తాల నుంచి భక్తులు భారీగా తరలొచ్చారు. భక్తులు స్వా మి వారి రథాన్ని లాగేందుకు పోటీపడ్డారు. ఊర్కొండపేట గ్రామం వైపు ఉన్న వేపచెట్టు కింద ఉన్న స్వామి గ ద చుట్టూ రథం తిప్పాక తిరిగి ఆలయ ప్రాంగణంలోకి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా అర్చకులు, భక్తులు ప్రత్యే క పూజలు చేశారు. ఆనంతరం స్వామిని ఆలయంలోకి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆంజనేయస్వామి నామస్మరణ మార్మోగిపోయింది. జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి ఉత్సవాలకు హాజరై స్వామి రథాన్ని లాగారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో శ్రీనివాస్‌రెడ్డి, సిబ్బంది, పాలక మండలి ప్రత్యేక చర్యలు చేపట్టింది. సీఐ సైదులు ఆధ్వర్యంలో బందోబస్తు చర్యలు చేపట్టారు. కార్యక్రమంలో ఎంపీపీ రాధ, వైస్ ఎంపీపీ అరుణ్‌కుమార్‌రెడ్డి, జెడ్పీటీసీ శాంతకుమారి, సర్పంచ్ అనిత, ఎంపీటీసీ ఈశ్వరమ్మ, కో ఆప్షన్ సభ్యుడు ఖలీంపాషా, ధర్మకర్తల మండలి సభ్యులు కళమ్మ, గోపి, శ్రీనివాస్‌రెడ్డి, రమేశ్‌గౌడ్, రాములు, రాజేశ్, నాయకులు గిరినాయక్, గోపాల్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి