
మహబూబ్‌నగర్, జనవరి 30 : మహనీయు ల ఆశయాలను ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం కలెక్టరేట్లో మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ ఔన్నత్యం కోసం పాటుపడిన మహనీయులను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో కలెక్టరేట్ అధికారులు పాల్గొన్నారు.
ట్రస్మా ఆధ్వర్యంలో..
మహబూబ్‌నగర్‌టౌన్, జనవరి 30 : ట్రస్మా ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని మహాత్మాగాంధీ రోడ్డు స్కూల్లో గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ట్రస్మా జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్జీ, రాంచందర్‌జీ, అబ్దుల్‌సమీ, నవీన్, వెంకటేశ్ పాల్గొన్నారు. అదేవిధం గా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గాంధీజీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, సీజే బెనహర్, లక్ష్మణ్‌యాదవ్, సుభాష్, ఖాదర్, రాంరెడ్డి, రాములుయాదవ్, భీంరెడ్డి, అబూబకర్, అంత య్య, మల్లేశ్ పాల్గొన్నారు.
భూత్పూర్ మున్సిపాలిటీలో..
భూత్పూర్, జనవరి 30 : మున్సిపాలిటీలోని చౌరస్తాలో మహాత్మాగాంధీజీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమం లో మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్, టీఆర్ఎస్ నాయకులు సత్తూర్ నారాయణగౌడ్, కోఆప్షన్ సభ్యుడు అజీజ్, పట్టణ అధ్యక్షుడు సురేశ్‌గౌడ్, బోరింగ్ నర్సింహులు, గడ్డం రాములు, వెంకటయ్య, ప్రేమ్‌కుమార్, యాదయ్య పాల్గొన్నారు.
అడ్డాకుల మండలంలో..
మూసాపేట(అడ్డాకుల), జనవరి 30 : మండలకేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో గాంధీజీ విగ్రహానికి ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే శాఖాపూర్, కందూరు, పొన్నకల్, రాచాల, పెద్దమునగల్‌చేడ్, చిన్నమునగల్చేడ్, కాటవరం, కన్మనూరు, బలీదుపల్లి తదితర గ్రామాల్లో గాంధీజీ వర్ధంతి నిర్వహించారు.
మూసాపేట మండలంలో..
మండలకేంద్రంతోపాటు నిజాలాపూర్, నందిపేట, జానంపేట, వేముల, చక్రాపూర్, పోల్కంపల్లి, కొమిరెడ్డిపల్లి తదితర గ్రామాల్లో మహాత్మాగాంధీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ విగ్రహం, చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
జడ్చర్ల పట్టణంలో..
జడ్చర్లటౌన్, జనవరి 30 : జడ్చర్ల పట్టణంలో సంస్కారభారతి ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా బాదేపల్లి చౌరస్తాలో గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే మండలంలోని బూర్గుపల్లి గ్రామస్తులు గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీసీసేన రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయాదవ్, వెంకటేశ్, పాండు, భాస్కర్, శివ, హమీద్, గోనెల రాధాకృష్ణ, బూర్గుపల్లి మాజీ సర్పంచ్ నర్సింహారెడ్డి, ఇన్చార్జి సర్పంచ్ కృష్ణకుమార్, ఉపసర్పంచ్ కొండల్‌యాదవ్, కిశోర్‌కుమార్, రామస్వామి, శంకర్, పాండు, శ్రీకాంత్, గోపాల్, రవి, మల్లేశ్, యాదయ్య, చంద్రయ్య, విష్ణు, రవికుమార్, రాజు తదితరులు పాల్గొన్నారు.
మహ్మదాబాద్ మండలంలో..
మహ్మదాబాద్, జనవరి 30 : మండలకేంద్రంలో మహాత్మాగాంధీ వర్ధంతిని ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా పలువురు గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అనంతయ్యగుప్తా, సురేశ్, పాప య్య, నర్సింహులు, శ్రీనివాసులు, కిశోర్, బాలచందర్ తదితరులు పాల్గొన్నారు.
దేవరకద్ర మండలంలో..
దేవరకద్ర రూరల్, జనవరి 30 : మండలకేంద్రంలో గాంధీజీ వర్ధంతిని ఘనంగా నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం జిల్లా కమి టీ సభ్యుడు కన్నయ్యశెట్టి ఆధ్వర్యంలో మండల కమిటీ సభ్యులు గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే గోపన్‌పల్లి, వెంకటాయపల్లి గ్రామాల్లో గాంధీజీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. చిన్నచింతకుంట మండలకేంద్రం లో సర్పంచులు, ఎంపీటీసీలు గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
బాలానగర్ మండలంలో..
బాలానగర్, జనవరి 30 : మండలంలోని వాయిల్కుంటతండాలో మహాత్మాగాంధీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి సర్పంచ్ గోపీనాయక్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ స్వాతంత్య్ర ఉద్యమంలో మహత్మాగాంధీ పోరాటం మరవలేదనిదన్నారు. గాంధీజీ ఆశయసాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ జవహర్‌నాయక్, వార్డుసభ్యులు పాల్గొన్నారు.