
ఊర్కొండ, జనవరి 30 : ఊర్కొండపేట గ్రామంలోని శ్రీ అభయాంజనేయస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఆదివారం రెండో రోజుకు చేరాయి. రాత్రి 8 గంటలకు స్వామి గజ వాహనంపై ఊరేగారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఆలయ అర్చకులు స్వామికి ప్రత్యేక అలంకరణ చేసి సుప్రభాత సేవతో మేల్కొలిపి వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. ఎలాంటి ఇబ్బందుతులు తలెత్తకుండా ఆలయ సిబ్బందిచర్యలు తీసుకున్నారు. భక్తులతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. కల్వకుర్తి సీఐ సైదులు పర్యవేక్షణలో ఊర్కొండ ఎస్సై విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో భద్రతా ఏర్పాట్లు చేశారు.