
మహబూబ్‌నగర్, జనవరి 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టుబడి ఉన్నారని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. స్వాతంత్రం వచ్చి 75 ఏండ్లు దాటినా నేటికీ అక్కడక్కడ ఎస్సీ, ఎస్టీలపై అంటరానిత నం పాటిస్తూ అసాంఘికంగా ప్రవర్తించడం దురదృష్టకరమన్నారు. సమాజంలోని అసమానతలు రూపు మా పేందుకు అధికారులు ముందుకు రాకుంటే దాని ప్రభా వం దారుణంగా ఉంటుందన్నారు. అందుకే సంబంధి త శాఖల అధికారులు ఇలాంటి వాటిపై వెంటనే చర్య లు చేపట్టాలని ఆదేశించారు. గురువారం మహబూబ్‌నగర్ జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని హైదరాబాద్ నుంచి వెబెక్స్ వీడి యో కాన్ఫరెన్స్‌లో మంత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలపై దాడులకు సంబంధించి పోలీసులు వెంటనే కేసులు నమోదు చేయాలన్నారు. ముఖ్యంగా భూమి తగాదాలు, ఇతర విషయాలకు సంబంధించి నమోదైన కేసులపై తక్షణ నివేదికలు అందించాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ గత సమావేశాల్లో చర్చించిన విషయాలన్నింటినీ మరోసారి సమీక్షించిన తర్వాత వాటికి శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులందరూ ఎస్సీ, ఎ స్టీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఎ స్సీ, ఎస్టీల అట్రాసిటీ కేసుల విషయంలో మాత్రమే కా కుండా వారు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు సైతం అధికారులు కృషి చేయాల్సి ఉందన్నారు. వ్యక్తిగత రుణాలు, ఆయా పథకాల కింద లబ్ధిపొందడంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని సూచించారు. కేవలం ఫిర్యాదులు వచ్చినప్పుడే కాకుండా ఎస్సీ, ఎస్టీలకు సం బంధించిన సమస్యలను సుమోటోగా తీసుకుని సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకం ద్వారా లబ్ధిదారు లు లాభపడేలా విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశంలో చర్చించాలని కోరారు.
కేసుల పరిష్కారంలో జాప్యం వద్దు : కలెక్టర్ వెంకట్రావు
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై కలెక్టర్ వెంకట్రావు మాట్లాడారు. కేసుల పరిష్కారంలో జాప్యం చేయకూడదని, అదేవిధంగా సభ్యులు సమావేశం దృష్టికి తీసుకొచ్చిన ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆ దేశించారు. ఎస్సీ, ఎస్టీ ధ్రువీకరణ పత్రాల జారీలో జా గ్రత్తలు తీసుకోవాలని, వారి భూముల తగాదాలకు సం బంధించిన సమాచారాన్ని పోలీసులు కోరిన పక్షంలో రెవెన్యూ అధికారులు అందించాలని కోరారు. ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన లబ్ధి, నష్ట పరిహారం వంటివి కలెక్టర్ కార్యాలయం నుంచి వారం రోజుల్లో పరిష్కరించాలన్నారు. ఒంటరి ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఉపాధి కల్పించేందుకుగానూ స్కిల్ డెవలప్మెంట్ కింద వారిని ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీల కేసులను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు అన్నారు. ఈ ఏడాది జూలై వరకు 45 కేసులు నమోదు కాగా 31 కేసులకు చార్జ్‌షీట్ దాఖలు చేశామని.. 14 కేసులు ఇన్వెస్టిగేషన్ దశలో ఉన్నాయని తెలిపారు. హైకోర్టులో పెండింగ్ ఉన్న 2 కేసులు తప్పా మిగిలినవి ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని చెప్పారు.
సమస్యల ప్రస్తావన..
మూసాపేటలో ఎస్టీల దేవాలయానికి భూమిని కేటాయించాలని ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బాలయ్య కోరారు. దీనికి స్పందించి న కలెక్టర్ ప్రతిపాదనలు పంపాలని తాసిల్దార్‌ను ఆదేశించారు. మహబూబ్‌నగర్‌లోని ఇంటిగ్రేటెడ్ ఎస్సీ హా స్టల్లో ఉన్న ఖాళీ స్థలంలో ఎస్సీ స్టడీ సర్కిల్ నిర్మాణం చేపట్టాలని మరో సభ్యుడు కావలి కృష్ణ కోరారు. ఎస్సీ, ఎస్టీలు కానివారు ఎస్సీ సర్టిఫికెట్లు పొంది ఇటీవల ఉ ద్యోగుల కేటాయింపులో మహబూబ్‌నగర్‌కు బదిలీపై వచ్చారని, వారిపై చర్యలు తీసుకుని ఇలాంటి ఘటన లు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని సభ్యుడు బా లరాజు కోరారు. ఎస్సీ, ఎస్టీలలో ఒంటరి మహిళలకు ఆర్థిక సహకారం అందించేందుకు చర్యలు తీసుకోవాలని మరో సభ్యురాలు గోవర్ధని కోరారు. వీటన్నిటిపై కలెక్టర్ స్పందిస్తూ చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమావేశంలో దేవరకద్ర ఎమ్మెల్సీ ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ యాదయ్య, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
మంత్రి నిరంజన్‌రెడ్డికి కరోనా
వనపర్తి, జనవరి 27 (నమస్తే తెలంగాణ) : వ్యవసా య శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గురువారం కొవిడ్ పరీక్ష చే యించుకోగా విషయం వెల్లడైంది. మంగళవారం జిల్లా కేంద్రంలో వంద పడకల దవాఖాన ప్రారంభం, మెడికల్ కళాశాల నిర్మాణ పనులను మంత్రి హరీశ్‌రావుతో కలిసి పరిశీలించారు. మూడ్రోజులుగా అభివృద్ధి కార్యక్రమాల్లో, బుధవారం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సమయంలో తనను కలిసిన వారం తా పరీక్షలు చేయించుకోవాలని మంత్రి సూచించారు.