
మద్దూర్, సెప్టెంబర్ 7 : టీఆర్ఎస్తోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని, పార్టీ బలోపేతానికి ప్రతిఒక్కరూ కృషి చే యాలని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సి.వెంకటయ్య అన్నారు. మంగళవారం మండలంలోని కొత్తపల్లి, కొత్తపల్లి తండా, మన్నాపూర్, లింగాల్చేడ్, పెద్దాపూర్, వీరారం, కొమ్ముర్ తదితర గ్రామాల్లో కమిటీలను ఏర్పాటు చేశారు. కొత్తపల్లి గ్రామ అధ్యక్షుడిగా శ్రీనివాస్‌రెడ్డి, కార్యదర్శిగా రాజు, కొత్తపల్లి తండా గ్రామ అధ్యక్షుడిగా చందర్‌నాయక్, కార్యదర్శిగా లక్ష్మణ్‌నాయక్, వీరా రం గ్రామ అధ్యక్షుడిగా బాజరప్ప, కార్యదర్శిగా కేశవులునాయ క్, మన్నాపూర్ గ్రామ అధ్యక్షుడిగా శ్రీహరిగౌడ్, కార్యదర్శిగా జె.కనకప్ప, లింగాల్చేడ్ గ్రామ అధ్యక్షుడిగా శశిపాల్‌రెడ్డి, కార్యదర్శిగా బాలు, కొమ్ముర్ గ్రామ అధ్యక్షుడిగా రవికుమార్‌గౌడ్, కార్యదర్శిగా ఆనంద్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో నాయకులు సలీం, శివకుమార్, వీరేశ్‌గౌడ్, వెంకట్రాములుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఏకగ్రీవంగా వార్డు కమిటీ ఎన్నిక
నారాయణపేట టౌన్, సెప్టెంబర్ 7 : మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డులో టీఆర్ఎస్ వార్డు కమిటీని ఏకగ్రీవంగా ఎ న్నుకున్నట్లు పార్టీ సీనియర్ నాయకుడు, ఎన్నికల అధికారి బొ బ్బిలిపులి రమేశ్‌గౌడ్ తెలిపారు. మంగళవారం జరిగిన వార్డు సమావేశంలో వార్డు కమిటీ అధ్యక్షుడిగా మల్లేశ్‌యాదవ్, ప్రధా న కార్యదర్శిగా దేవానంద్చారితోపాటు ఉపాధ్యక్షుడిగా గంగ న్న, కార్యదర్శిగా మహేశ్, కోశాధికారిగా సత్యనారాయణ, ప్రచా ర కార్యదర్శిగా రవికుమార్, కార్యవర్గ సభ్యులుగా రాజు, కనక ప్ప, అక్బర్‌పాషా, ఎండి.అమీద్, గోపాల్‌లను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో నాయకులు శేఖర్‌యాదవ్, తాయప్ప తదితరులు పాల్గొన్నారు.
గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలి
కోస్గి, సెప్టెంబర్ 7 : గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేద్దామని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు హన్మంత్‌రెడ్డి, జెడ్పీటీ సీ ప్రకాశ్‌రెడ్డి అన్నారు. మండలంలోని మీర్జాపూర్, బిజ్జారం, కడంపల్లి తదితర గ్రామాల్లో గ్రామ కమిటీలను ఏర్పాటు చేశా రు. గ్రామస్థాయి నుంచి ప్రతి కార్యకర్త కష్టపడి పార్టీని పటిష్ఠం చేయాలని కోరారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రామకృష్ణ, ఎంపీపీ మధుకర్‌రావు, పీఏసీసీఎస్ చైర్మన్ భీంరెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.