ఇందూరు/నిజామాబాద్ రూరల్/డిచ్పల్లి/రుద్రూర్ (కోటగిరి)/ఖలీల్‌వాడి, (మోపాల్)/ఆర్మూర్/బోధన్, జనవరి 14 : జిల్లాలోని పలు ఆలయాల్లో గోదా రంగనాథుల కల్యాణోత్సవాన్ని శుక్రవారం కన్నుల పండువగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని జెండా బాలాజీ ఆలయంలో గోదాదేవి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ జాలిగం గోపాల్, ఈవో వేణు, వేదపండితుల సమక్షంలో ప్రత్యేక పూజలు, వివిధ కార్యక్రమాలు కొనసాగాయి. ఈ సందర్భంగా వేద పండితుడు సారంగపాణి శ్యామ్సుందరాచార్య ప్రవచనాలు బోధించారు. కల్యాణం సందర్భంగా భక్తులు ఆలపించిన కీర్తనలు అలరించాయి. వేడుకలకు హాజరైన భక్తులకు అన్నదానం చేశారు. ఉత్సవాల్లో ఆలయ ధర్మకర్తలు సాయిలు, నర్సింగ్‌రావు, రాముగౌడ్, శివప్రసాద్,ప్రవీణ్‌కుమార్, నాగరాజు, ఆంజనేయులు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
నగర శివారులోని సారంగాపూర్ ఎన్సీఎస్ఎఫ్ ఆవరణలో ఉన్న కోదండ రామాలయంలో గోదా దేవి కల్యాణం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సునీతా శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎంపీటీసీ హన్మంత్, రాంనగర్ ఎంపీటీసీ నీరజాస్వామి, గ్రామపెద్దలు వెంకటేశ్, అశోక్, శ్రీనివాస్‌గౌడ్, యాదేశ్ తదితరులు పాల్గొన్నారు.
డిచ్పల్లి మండంలోని ధర్మారం (బీ) గ్రామంలో ఉన్న వీర బ్రహ్మేంద్ర స్వామి అలయంలోని గోదా రంగనాథ స్వామి కల్యాణోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు స్వామివారి పల్లకీసేవతో భక్తులు తరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రావుల బ్రహ్మానందం, నాయుడు ఆంజనేయులు, పిచ్చేశ్వర్రావు, తులసీబాబు, సురేశ్, రాహుల్, తిరుపతి, సచిన్ త్రిపాఠి పాల్గొన్నారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని ఏడో పోలీస్ బెటాలియన్ ఆవరణలో ఉన్న శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో కమాండెంట్ సత్య శ్రీనివాసరావు దంపతుల ఆధ్వర్యంలో గోదాదేవి కల్యాణం నిర్వహించారు. భక్తులకు అన్నదానం చేశారు. అసిస్టెంట్ కమాండెంట్ భాస్కర్‌రావు, అనిల్‌కుమార్, మహేశ్, నరేశ్, వెంకటేశ్వర్లు, ఆర్ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
కోటగిరి మండలంలోని పొతంగల్ వేంకటేశ్వర ఆలయంలో స్వామివారి కల్యాణాన్ని వివేకానంద యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు.
మోపాల్ మండలంలోని ఇందూరు తిరుమల ఆలయంలో గోదాదేవి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు 11 రకాల పదార్థాలతో నైవేద్యం సమర్పించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, ఐడీసీఎంఎస్ చైర్మన్ మోహన్, గడీల రాములు తదితరులు పాల్గొన్నారు.
ఆర్మూర్ పట్టణంలోని రాంనగర్‌లోని రామాలయంలో మున్సిపల్ కౌన్సిలర్ గంగామోహన్ చక్రు, మరో ఐదుగురు దంపతుల ఆధ్వర్యంలో గోదాదేవి కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. దేగాం లక్ష్మీనారాయణ స్వామి మందిరంలో నిర్వహించిన కల్యాణంలో సర్పంచ్ గడ్డం సరోజనారెడ్డి, ఉపసర్పంచ్ గడ్డం గంగారెడ్డి, ఎంపీటీసీ ఉప్పునూతుల అనూషా శ్రీనివాస్‌గౌడ్, దేగాం మాజీ ఎంపీటీసీ బండారు మణిదీపికా యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
బోధన్ పట్టణం వేంకటేశ్వరనగర్లోని శ్రీ భూలక్ష్మీ సమేత వేంకటేశ్వరాలయంలో గోదాదేవి రంగనాథుల కల్యాణోత్సవం వైభవోపేతంగా జరిగింది. యాజ్ఞికులు కలకుంట్ల శ్రీధరాచార్యుల ఆధ్వర్యంలో ఆలయ పూజారి దీపక్పాండే వివాహ తంతును నిర్వహించారు. గాదె వెంకటరమణారావు, పెంటయ్యచారి, చామకూర మహేశ్‌రెడ్డి, చీలం వెంకట్‌రెడ్డి, నాగభూషణం, అచ్చిరెడ్డి దంపతులు యజమానులుగా వ్యవహరించారు.