జూరాల ప్రాజెక్టు క్రస్టు గేట్ల
మరమ్మతులకు రూ.12.48 కోట్లు విడుదల
గద్వాల, ఆగస్టు 20: ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయిని కృష్ణానదిపై ని ర్మించిన జూరాల ప్రాజెక్టు క్రస్టు గేట్లకు పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది. కృష్ణానదిపై తెలంగాణకు ముఖద్వారంగా ఉ న్న జూరాల ప్రాజెక్టుకు సంబంధించి ప్రభు త్వం నియమించిన టెక్నికల్ కమిటీ సాంకేతిక పరమైన అన్ని అంశాలు క్షుణ్ణంగా పరిశీలించింది. ప్రాజెక్టులో చేపట్టాల్సిన రిపేర్లు ఇతర సాంకేతిక అంశాలకు సంబంధించి నివేదిక రాష్ట్రనీటిపారుదల శాఖకు పంపడంతో నీటి పారుదల శాఖ జూరాలప్రాజెక్టు గేట్ల మరమ్మతులకు అవసరమైన నిధులను విడుదల చేసింది. కృష్ణానదిపై నిర్మించిన జూరాల ప్రాజెక్టుకు 1990లో క్రస్ట్ గేట్లను ఏర్పాటు చేశారు. 1996లో ప్రారంభించిన ప్రాజెక్టు నిర్వాహణ పనులు ప్రతి నాలుగేండ్లకు ఓ సారి పూర్తిస్థాయిలో చేపట్టాల్సి ఉం ది. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా జూరాల ప్రాజెక్టు క్రస్టు గేట్లు మరమ్మతులకు నోచుకోలేదు. దీంతో ప్రాజెక్టు గేట్లు తుప్పుపడుతూ గేట్ల ద్వారా నీరు లీకేజీ అ యి దిగువకు పోతున్నది. దీని ద్వారా ప్రాజెక్టుకు ముప్పు ఏర్పడే అవకాశం ఉండేది. ప్రాజెక్టుకు మొత్తం 62క్రస్టు గేట్లు ఉండగా, విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి ఆరుగేట్లు ఉన్నాయి. గేట్ల నిర్వహణలో ప్రతి నాలుగేండ్ల్లకోసారి రబ్బర్సీళ్లను మార్చాల్సి ఉంది. అ యితే అప్పటి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తో 18గేట్లు తుప్పుపట్టి నీటి లీకేజీలు ఏర్పాడ్డాయి. గేట్లను ఆపరేట్ చేసేందుకు ఏర్పా టు చేసిన మోటర్ల నిర్వహణ కూడా సరిగ్గా లేదు. గేట్లను పైకి లేపేందుకు ఏర్పాటు చేసిన ఉక్కు తీగలతో పేనిన తాళ్లకు గ్రీసింగ్ సరిగా లేదు దీంతో అవి జామ్ అయ్యాయి. ప్రతి ఏటా వీటన్నింటిని పరిశీలించి రిపేర్లు చేయాల్సిన గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ వచ్చింది. రాష్ట్రం ఏర్పాటయ్యాక ప్రభుత్వం జూరాల ప్రాజెక్టుపై దృష్టి పెట్టింది. నీటి పారుదల రంగంలో నిపుణులను ఎంపిక చేసి కమిటీగా ఏర్పాటు చేసి ప్రాజెక్టుల్లో సాంకేతిక అంశాలను అధ్యయనం చేయించింది. ఈ కమిటీ ప్రాజెక్టు క్రస్టు గేట్లను వెంటనే రిపేరు చేయించాలని సూచించడంతో ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం గేట్ల మరమ్మతుల కోసం రూ.12.48 కోట్లు విడుదల చేసింది.
మరమ్మతులు ఇవే..
క్రస్టు గేట్ల మరమ్మతులకు నీటిపారుదల శాఖ రూ.12.48కోట్లు విడుదల చేయడంతో ఆనిధుల ద్వారా మరమ్మతులు చేసే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి ప్రారంభించారు. ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వరద వచ్చిన సమయంలో గేట్లు రిపేరుకు రాకుండా చూసేందుకు ఇంజినీర్ల, నిఫుణుల సాయంతో గేట్లను ఎత్తడానికి అవసరమైన హాయిస్ట్ మోటర్ల నిర్వహణ, తుప్పు పట్టకుండా ఇసుకతో క్లీనింగ్ చేయించడం, గేట్లను ఎత్తాల్సిన ఉక్కు తాళ్లకు గ్రీసింగ్ చేయడం, గేట్లకు అవసరమైన రబ్బర్ సీళ్లు వేయడం, వంటి పనులు చేపడుతున్నారు. నీటిపారుదల శాఖ మరమ్మతులకు నిధులు విడుదల చేసి పనులు ప్రారంభిచడంతో జూరాల ప్రాజెక్టులో నిలువ ఉండే నీరు ఇక చుక్క కూడా బయటకు వెళ్లే అవకాశం లేదు.