విభూతి, భస్మం పౌడర్‌తో బురిడీ
అమాయక ప్రజలే టార్గెట్
కార్లు, నగదు, సెల్ఫోన్లు, రాగి స్వాధీనం
గద్వాల న్యూటౌన్, సెప్టెంబర్ 3 : విభూతి, భస్మం పౌడ ర్, పాముతో అత్యాశ పరుడిని మోసం చేసి రూ.62.50 లక్షల నగదుతో ఉడాయించిన మంత్రగాళ్ల ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు జోగుళాంబ గద్వాల ఎస్పీ రంజన్త్రన్ కుమార్ తెలిపారు. జిల్లా ప్రధాన పోలీస్ కార్యాలయం లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మహారాష్ట్రలోని వాసీం జిల్లా రిసోడ్ గ్రామానికి చెందిన మహ్మద్ తాశావర్ ఖాన్, సయ్యద్ ఇక్బాల్, అజయ్, భీంరావు, అలీమ్వుద్దీన్, నవాజ్ షేక్, హైదరాబాద్‌కు చెందిన అన్వర్ ఖాన్, షేక్బషీద్ ఒక గ్రూప్‌గా ఏర్పడ్డారు. ఇంట్లో పూజలు చేస్తే అద్భుతమైన శక్తులు వస్తాయని, భస్మం, విభూతి పౌడ ర్ చల్లితే ధనలక్ష్మీ కటాక్షమవుతుందని, ఆకాశం నుంచి డ బ్బులు వస్తాయని 2019 సంవత్సరంలో అయిజ మండలంలోని ఉప్పల గ్రామానికి చెందిన ప్రహ్లాద్ రెడ్డిని నమ్మించారు. నిజమని భావించిన ప్రహ్లాద్‌రెడ్డి ఇంట్లో ఉన్న రూ.62.50లక్షలను పూజలో ఉంచాడు. ఈ క్రమంలో ముఠా సభ్యులు పూజలు చేస్తున్నట్లు నమ్మించి.. అప్పటికే మత్తు కలిపిన పౌడర్‌ను వారిపై చల్లారు. అనంతరం అక్క డి నుంచి డబ్బులతో వారు జారుకున్నారు. మోసపోయానని గ్రహించి అప్పట్లో అయిజ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కాగా, ఇదే తరహాలో గత నెల 30న అయిజ మం డలం తుపత్రాల గ్రామానికి చెందిన సూర్య వెంకన్న గౌడ్ ఇంట్లో కూడా పూజలు చేయాలని నమ్మించారు. భస్మం, విభూతి డబ్బా కొనాలని, ఒక్కోదానికి రూ.10 లక్షలు ఖ ర్చు అవుతుందని చెప్పారు. సూర్యవెంకన్న గౌడ్ అడ్వాన్స్ గా రూ.30వేలను ముఠా సభ్యులకు ఇవ్వగా, వారు ఆ డ బ్బుతో హైదరాబాద్‌కు వెళ్లారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు అయిజ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు అప్రమత్తమై ముఠా సభ్యులు వినియోగించిన సెల్ఫోన్లు, కార్ల ఆధారంగా నిఘా పెట్టారు. ఈనెల 3న అయిజ మీదుగా రాయిచూర్‌కు వెళ్తున్నట్లు సమాచా రం రావడంతో అయిజ శివారులో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో ముఠా సభ్యులను గుర్తించి వారి వద్ద ఉన్న రెండు కార్లు, 9 సెల్ఫోన్లు, రూ.25వేల నగదు, వి భూతి, భస్మం పౌడర్ డబ్బాలు, రెండు రాగి రింగులను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నాగపామును ఫారె స్టు అధికారులకు అప్పగించారు. ఎనిమిది మంది నిందితులను గద్వాల కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బాబాలు, మంత్రగాళ్లతో జాగ్రత్తగా ఉండాలన్నారు. కేసు ను ఛేదించిన గద్వాల డీఎస్పీ రంగస్వామి, శాంతినగర్ సీ ఐ వెంకటేశ్వర్లు, ఎస్సై ముత్తయ్య, సిబ్బంది రంజిత్ కుమా ర్, శివశంకర్, నాగేశ్, యాకుబ్, వెంకప్ప, రాజశేఖర్, శ్రీనివాసులు, ఆంజనేయులను ఎస్పీ అభినందించారు.