చార్మినార్ : సమైక్యరాష్ట్ర సంకెళ్లను తెంచి తెలంగాణ రాష్ట్ర విముక్తి కోసం పోరుసల్పిన యోధుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్రలో తనకుంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నారని మొఘల్ఫుర డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పుప్పాల రాధకృష్ణ, మాజీ అధ్యక్షులు గోపినాధ్ యాదవ్‌లు తెలిపారు.
పరాయి పాలన నుండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి నాడు కేసీఆర్ ఆమరణ నిరహారదీక్ష చేపట్టి నేటికి 12 వసంతాలుకావడంతో సోమవారం చారిత్రక చార్మినార్ వద్ద రాధకృష్ణ ఆధ్వర్యంలో దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించా రు.నవంబర్ 29ని రాష్ట్ర చరిత్రను మలుపుతిప్పిన రోజుగా వారు అభివర్ణించారు.
అనేక సంవత్సరాలుగా సాగుతున్న స్వరాష్ట్ర ఏర్పాటు కలను సుసాధ్యం చేయడానికి సిద్ధపడిన కేసీఆర్ ఆమరణ నిరహార దీక్షతో కేంద్రప్రభుత్వం మెట్టుదిగి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందన్నారు. కేసీఆర్ తీసుకున్న అనేక నిర్ణయాలతో నేడు రాష్ట్రం బంగారు తెలంగాణ సాధనవైపు అడుగులు వేస్తుందని తెలిపారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చిత్రపటానికి గుమ్మడి కాయలతో రాధకృష్ణ, గోపినాధ్ యాదవ్‌లు దిష్టితీశారు. ఈ కార్యక్రమంలో మణికొండ విజయ్ కుమార్, రజని కులకర్ణి, పూజా, ఎండీ రజాక్తోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.