
ఊట్కూర్, జనవరి 21 : ప్రభుత్వ ఆదేశాల మేరకు నియోజకవర్గ వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో శుక్రవారం ఇంటింటి జ్వ ర సర్వే నిర్వహించారు. ప్రభుత్వం ఇంటింటి జ్వర సర్వే నిర్వహించడం ఇది రెండోసారి. కరోనా వైరస్ థర్డ్‌వేవ్ విజృంభన నే పథ్యంలో ఇంటింటి జ్వర సర్వే తిరిగి నిర్వహించాల్సి వస్తుందని అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, అం గన్వాడీ, పంచాయతీ కార్యదర్శులు ఇంటింటికీ తిరుగుతూ జ్వ రం, దగ్గు, జలుబు వంటి కరోనా లక్షణాలున్న వారి వివరాలు నమోదు చేసుకున్నారు. కరోనా లక్షణాలు ఉన్న వారు సంబంధిత దవాఖానల్లో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. మరో పక్క ఆయా మండలకేంద్రాలు, పీహెచ్సీ సబ్ సెంటర్ల్లో కరోనా లక్షణాలు ఉన్న వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైరస్ బారిని పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు.
ప్రారంభమైన ఫీవర్ సర్వే
కోస్గి, జనవరి 21 : ఇంటింటి ఫీవర్ సర్వే ప్రారంభమైంది. అందులో భాగంగా మండలంలోని ఆయా గ్రామాల్లో శుక్రవా రం సర్వే ప్రారంభించారు. మండలంలోని అన్ని గ్రామాలతోపాటు మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో ఫీవర్ సర్వే చే స్తూ 9వ వార్డులో సర్వేతోపాటు వైస్ చైర్పర్సన్ అన్నపూర్ణ ఆధ్వర్యంలో కరోనా కిట్లను పంపిణీ చేశారు.
వివరాలు నమోదు చేస్తూ అవగాహన
కృష్ణ, జనవరి 21 : కరోనా విజృంభిస్తున్న సందర్భంగా ప్రతి గ్రామంలో ఇంటింటి సర్వే కొనసాగుతున్నది. మండలకేంద్రంతోపాటు గుడెబల్లూర్, ము రహరిదొడ్డి, కున్సి, ఆలంపల్లి, చేగుంట తదితర గ్రా మాల్లో శుక్రవారం ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, ఇతర సిబ్బంది ఇంటింటికీ తి రుగుతూ ఎవరికైనా జ్వరం, దగ్గు, జలుబు, ఇతర అరోగ్య సమస్యలు ఉన్నాయని అడిగి తెలుసుకొని వివరాలను నమోదు చేస్తూ అవగాహన కల్పించారు.
మరికల్ మండలంలో…
మరికల్, జనవరి 21 : మండలంతోపాటు గ్రా మాల్లో శుక్రవారం ఫీవర్ సర్వేను ప్రారంభించారు. ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, వైద్య సిబ్బంది, పంచాయతీ సిబ్బంది ఇంటింటికీ తి రిగి జ్వర సర్వే నిర్వహించారు. కరోనా లక్షణాలు ఉ న్న వారికి మందుల కిట్లను అందజేసి అవగాహన క ల్పించారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు, సర్పంచు లు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
మద్దూర్ మండలంలో…
మద్దూర్, జనవరి 21 : మండలంలోని భీంపూర్, చెన్వర్, అచ్చంపల్లి, అప్పారెడ్డిపల్లి తదితర గ్రామాల్లో శుక్రవారం ఇం టింటా జ్వర సర్వే నిర్వహించారు. కరోనా లక్షణాలు ఉన్న వారి కి మందుల కిట్లను అందజేసి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీడీవో విజయలక్ష్మి, ఆయా గ్రామాల సర్పంచులు, వైద్య సిబ్బంది, అంగన్వాడీ, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
నర్వ మండలంలో…
నర్వ, జనవరి 21 : మండలంలోని అన్ని గ్రామా ల్లో వైద్య సిబ్బంది, ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచ ర్లు, ఏఎన్ఎంలు, పంచాయతీ సిబ్బంది శుక్రవారం ఇంటింటికి తిరుగుతూ ఫీవర్ సర్వే నిర్వహించారు. నర్వ, యాంకి, పెద్ద కడుమూర్ గ్రామాల్లో మండల ప్రత్యేకాధికారి శివప్రసాద్‌రెడ్డి, ఎంపీడీవో రమేశ్‌కుమార్ ఇంటింటా సర్వేను పర్యవేక్షించారు. ప్రజలు వైద్య సిబ్బందికి సహకరించి జ్వర పరీక్షలు చేసుకోవాలన్నారు. జ్వరం ఉన్న వారికి కొవిడ్ కిట్లను అందజేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మాగనూర్ మండలంలో…
మాగనూర్, జనవరి 21 : మండలంతోపాటు గ్రా మాల్లో శుక్రవారం ఇంటింటా ఆరోగ్య సర్వే కార్యక్ర మం నిర్వహించామని డాక్టర్ శ్రీమంత్ తెలిపారు. మండలవ్యాప్తంగా 1,358 ఇండ్ల జర్వ సర్వే నిర్వహించామన్నారు. కరోనా లక్షణాలతో బా ధపడుతున్న 19 మందికి అక్కడే పరీక్షలు నిర్వహించి కిట్టు పంపిణీ చేశామన్నారు. ఎలాంటి అనుమానాలు లేకుండా ప్రతిఒక్కరూ కరోనా సంబంధిత లక్షణాలు ఉంటే వెంటనే ఆశ కార్యకర్తల వద్ద మం దులు తీసుకోవాలని సూచించారు. వ్యా ధి లక్షణాలు త్వరగా గుర్తించి మందులు వినియోగిస్తే కరోనా అధికంగా ప్రబలకుం డా చేయవచ్చన్నారు. అందరూ కచ్చితం గా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించి, శానిటైజేషన్ వినియోగిస్తే కరోనాను జయించగలమన్నారు. అదేవిధం గా ఇటుక బట్టీలోని పని చేసే కార్మికులకు జ్వర సర్వే చేశామన్నారు.
వైద్య సిబ్బందికి సహకరించాలి : పేట జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్
నారాయణపేట టౌన్, జనవరి 21 : జిల్లాలో ఇంటింటి జ్వర సర్వే నిర్వహించే సిబ్బందికి ప్రజలు సహకరించాలని పేట జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్ అన్నారు. పట్టణంలోని జెడ్పీ కార్యాలయంలో వనజాగౌడ్తోపాటు ఉద్యోగులు శుక్రవారం బూస్టర్ డో స్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ కరోనా వైరస్ విస్త్రృతంగా వ్యాపిస్తున్న నేపథ్యం లో ప్రభుత్వం ఇంటింటి ఫీవర్ సర్వే చేపట్టేందుకు నిర్ణయించిందన్నారు. ఎలాంటి ఖర్చు లేకుండా ఇంటింటికి తిరిగి ఆరోగ్య సర్వే చేయించడం అనేది ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయమన్నారు. కొవి డ్ జాగ్రత్తలు తీసుకుంటూ వైద్య సిబ్బంది జ్వర సర్వే చేయాలన్నారు. సర్వేలో కరోనా లక్షణాలు కనబడితే ప్రతి పేషంట్‌కు మెడికల్ కిట్‌ను అందజేస్తారన్నారు. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లోని అధికారులు, ప్రజాప్రతినిధులు వైద్య సి బ్బందితో సమన్వయం చేస్తూ తమ పరిధిలోని ప్రతి వ్యక్తి ఫీ వర్ సర్వేలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలన్నారు.
లక్షణాలు ఉంటే తెలియజేయాలి : పేట మున్సిపల్ చైర్పర్సన్
నారాయణపేట టౌన్, జనవరి 21 : ఫీవర్ లక్షణాలు ఉన్నట్లయితే ఇంటింటి ఫీవర్ సర్వేలో పా ల్గొనే సిబ్బందికి తెలియజేయాలని పేట మున్సిపల్ చైర్పర్సన్ అనసూయ అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం పట్టణంలోని అన్ని వార్డుల్లో ఇం టింటి ఫీవర్ సర్వే ప్రారంభమైంది. 5వ వార్డులో నిర్వహించిన ఫీవర్ సర్వేను ఆమె, ఇన్చార్జి మున్సిపల్ కమిషనర్ సందీప్‌కుమార్, జెడ్పీ డిప్యూటీ సీ ఈవో జ్యోతి పరిశీలించారు. ఇంటింటికి తిరిగి ఫీవ ర్ ఉన్నవారికి కిట్లు అందజేశారు. ఏఎన్ఎం రామేశ్వరి, ఆశ వర్కర్లు మహేశ్వరి, రాధిక, మున్సిపల్ హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాస్, వార్డు అధికారి దేవరాజు పాల్గొన్నారు. రెండో వార్డులో కౌన్సిలర్ అనిత, ఆశ వర్కర్లు శివ మ్మ, లక్ష్మీ, వార్డు ప్రత్యేక అధికారి రాఘవేంద్రలు, అంగన్వా డీ టీచర్లు గీత, రాధిక ఇంటింటికి తిరిగి ఫీవర్ సర్వే నిర్వహించారు. ఫీవర్ లక్షణాలు ఉన్నవారికి కిట్లు అందజేశారు. 15వ వార్డులో కౌన్సిలర్ రాజేశ్వరి, వార్డు ప్రత్యేక అధికారి ప్రదీప్ ఇంటింటికి తిరిగి ఫీవర్ సర్వే నిర్వహించి అవసరమైన వారికి కిట్లు అందజేశారు. 8వ వార్డులో కౌన్సిలర్ శిరీష, ఏఎన్ఎం రామేశ్వరి, ఆశ వర్కర్ లక్ష్మి, అంగన్వాడీ టీచర్ సునీత ఇంటింటికి తిరిగి ఫీవ ర్ సర్వేలో పాల్గొన్నారు. సీనియర్ సిటిజన్స్‌కు బూస్టర్ డోస్ అందజేశారు.