
శ్రీరంగాపూర్, జనవరి 13 : రాష్ట్రంలో పంటల మార్పిడిలో భాగంగా ఆయిల్‌పాంకు ప్రోత్సా హం ఇస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని కంబాళాపూర్ గ్రామంలో ఆయిల్‌పాం పంటలను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ప్రజల అవసరాలకు 80 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పాం సాగు చేపట్టాల్సి ఉన్నదన్నారు. కానీ ప్రస్తుతం 8 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగవుతున్నదని తెలిపారు. అందుకే తెలంగాణలో 20 లక్షల ఎకరాల్లో సాగు చేసేందుకు లక్ష్యం నిర్దేశించినట్లు ఈ తోటలు సాగు చేయాలనుకుంటే రైతులకు ప్రభు త్వ ప్రోత్సాహం అందిస్తున్నదని పేర్కొన్నారు. ఉపాధి హామీ కింద గుంతల తవ్వకం, డ్రిప్ పరికరాల కోసం రుణాలు ఇప్పించే ప్రక్రియ ప్రభుత్వమే చేపట్టనున్నదన్నారు. సంప్రదాయ పంటలతో రైతులు నష్టపోకుండా పంటల మార్పిడి చేయాలని రైతులకు మంత్రి సూచించారు. కంబాళాపూర్ గ్రామంలో 50 ఎకరాలలో ఈ తోటలు సాగు చేసిన రైతులు ఆనంద్‌రెడ్డి, పుల్లారెడ్డి, నారాయణరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రాజవర్ధన్రెడ్డిని మంత్రి అభినందించారు. కార్యక్రమంలో రైతుబంధు సమి తి మండలాధ్యక్షుడు గౌడ్ నాయక్, పెబ్బేరు సింగిల్ విండో అధ్యక్షుడు కోదండరాంరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ
వనపర్తి, జనవరి 13 : ఆపదలో ఉండి సీఎంఆర్ఎప్కు ధరఖాస్తు చేసుకున్న వారికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు, విడుదలైన ఎల్వోసీలను లబ్ధిదారులకు మంత్రి పంపిణీ చేశారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వానికి రెండు కండ్లుగా పేర్కొన్నారు. సర్కార్ అందిస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే జిల్లా కేంద్రంలోని రాజనగరంలో ఉన్న అమ్మ చెరువు సుందరీకరణ పనులను మంత్రి పరిశీలించారు. పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి, ఏఈ భాస్కర్, కౌన్సిలర్లు అలివేల గోపాల్, నాగన్న, పాకనాటి కృష్ణయ్య, రాష్ట్ర మార్క్‌ఫెడ్ డైరెక్టర్ విజయ్, గొర్రెల కాపరుల సంఘం జిల్లా అధ్యక్షుడు కురుమూర్తి యాదవ్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.