అబిడ్స్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దర్గా, మసీదుల అభివృద్దికి పాటు పడుతుందని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర నాయకులు ఎంకె భద్రుద్దీన్ నేతృత్వంలో వివిధ దర్గాలకు చెందిన కమిటీ ప్రతినిధులు మంత్రిని ఆయన నివాసంలో కలిసి సన్మానించారు.
ఈ సందర్భంగా మంత్రి మహమూద్‌అలి మాట్లాడుతూ రాష్ట్రంలోని వక్ఫ్ భూముల పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటోందన్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్ని వర్గాల అభ్యున్నతికి సంక్షేమ పథకాలు చేపడుతున్నట్లు వివరించారు.
టీఆర్ఎస్ పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర నాయకులు ఎంకె భద్రుద్దీన్ మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సంక్షేమ పథకాలు చేపడుతున్నారని తెలిపారు. వక్ఫ్ భూముల పరిరక్షణకు పాటు పడుతున్నారన్నారు.
మంత్రి మహమూద్ అలీ చొరవతో షావలి దర్గా సమస్య తీరినందుకు ఆయన, దర్గా కమిటీ ప్రతినిధులు మంత్రి మహమూద్అలికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సజ్జాద నషీన్, షేక్ అహ్మద్ ఖాద్రి, షేక్ గులాం షా, షేక్ ఖమ్రుద్దీన్, హఫీజ్ సయ్యద్ అమేర్, జియా ఉర్ రహమాన్, షేక్ గులాం హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.