ఈ నెలాఖరులోగా వంద శాతం పూర్తయ్యేలా వికారాబాద్ జిల్లా యంత్రాంగం చర్యలు
జిల్లాలో 88 శాతం పూర్తయిన మొదటి డోసు
రెండో డోసు 26 శాతం పూర్తి
76 హ్యాబిటేషన్లలో 100 శాతం వ్యాక్సినేషన్
వ్యాక్సిన్‌పై ఇంటింటికీ వెళ్లి ఆరా తీస్తున్న వైద్య సిబ్బంది
పరిగి, డిసెంబర్ 17:కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ నెలాఖరులోగా వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా వికారాబాద్ జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే జిల్లాలో 88 శాతం మొదటి డోసు వ్యాక్సినేషన్‌ను పూర్తి చేయగా, రెండో డోసు వ్యాక్సినేషన్‌ను 26 శాతం పూర్తి చేశారు. జిల్లా పరిధిలోని 76 హ్యాబిటేషన్లలో 18 ఏండ్లు నిండిన వారందరికీ 100 శాతం వ్యాక్సినేషన్‌ను పూర్తి చేశారు. వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్ వేసుకున్నారా.. లేదా అని ఆరా తీసి వ్యాక్సిన్ వేస్తున్నారు. అంతేకాకుండా జిల్లాలోని 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మున్సిపాలిటీల్లోని 97 వార్డులు, 138 ఆరోగ్య ఉప కేంద్రాల్లో వ్యాక్సిన్ వేస్తున్నారు.
కరోనా నుంచి రక్షణ కోసం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ నెలాఖరు వరకు వందశాతం పూర్తి చేయ డం లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా 18 సంవత్సరాలు నిండిన వారు 709526 మంది ఉండగా 16వ తేదీ నాటికి 626358 మందికి(88)శాతం కొవిడ్ మొదటి డోసు వ్యాక్సిన్ పూర్తయింది. 181343 మందికి(26శాతం) రెండో డోసు వ్యాక్సిన్ వేశారు. ఇటీవల రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టీ.హరీష్‌రావు ప్రత్యేకంగా వ్యాక్సినేషన్‌పై సమీక్ష జరిపి ఈ నెలా ఖరు వరకు వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు. అందుకు అనుగుణంగా ప్రతి ఇంటికి తిరిగి టీకా వేసుకున్నారా లేదా తెలుసుకోవడంతోపాటు అర్హులందరికీ వైద్య సిబ్బంది వ్యాక్సిన్ వేస్తున్నారు. జిల్లా పరిధిలోని 76 హ్యాబిటేషన్లలో ఇప్పటివరకు వంద శాతం కొవిడ్ వ్యాక్సినేషన్‌ను వైద్య సిబ్బంది పూర్తి చేశారు. 76 హ్యాబి టేషన్ల పరిధిలో మొదటి డోసు 18 సంవత్సరాలు నిండిన వారందరికీ వేశారు. వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తయిన ప్రాంతాలలో వైద్య సిబ్బంది మరోసారి పర్యటించి కొత్త వారు ఎవరైనా వచ్చారా లేదా తెలుసు కుంటు న్నారు. కొత్తవారు వస్తే వారికి సైతం వ్యాక్సిన్ వేస్తున్నారు. వంద శాతం వ్యాక్సి నేషన్ పూర్తయిన ప్రాం తాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు సందర్శించి వివరాలు సేకరిస్తున్నారు. జిల్లాలోని 257 కేంద్రాలలో వ్యాక్సిన్ వేస్తున్నారు. జిల్లలోని 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మున్సిపాలిటీలలోని 97వార్డులు, 138 ఆరోగ్య ఉప కేంద్రాలలో వ్యాక్సిన్ వేస్తున్నారు. మొదటి డోసు వేసుకొని డ్యూ డేట్ వచ్చిన వారికి సైతం రెండో డోసు వ్యాక్సిన్ వేస్తున్నారు. వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుండగా 11 పీహెచ్‌సీల పరిధిలో 90శాతం పైగా మొదటి డోసు వ్యాక్సి నేషన్ పూర్తయింది. జిల్లాలో సైతం ఒకటిరెండు రోజుల లో సరాసరిగా 90 శాతం వ్యాక్సినేషన్ పూర్తవనుంది. డిసెంబర్ నెలాఖరు వరకు వంద శాతం వ్యాక్సినేషన్ చేపట్టడానికి ముందుకు సాగుతున్నారు.