
మెదక్, జనవరి 22 : మెదక్ జిల్లాలో ఇం టింటా జ్వర సర్వే రెండోరోజూ శనివారం కొనసాగింది. మొదటి రోజు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా 633 బృందాలు పాల్గొనగా, 37,711 ఇండ్లల్లో జ్వర సర్వే నిర్వహించారు. 2,433 మందికి కరో నా లక్షణాలు ఉన్నట్లు గుర్తించి కిట్లను అందజేశారు. రెండోరోజూ శనివారం 627 టీంలు పా ల్గొని 37,860 ఇండ్లల్లో జ్వర సర్వేను నిర్వహించారు. 2,547 మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించి కిట్లను పంపిణీ చేశారు.
ఉదయం 9 గంటల నుంచే ఇండ్లల్లోకి…
మెదక్ జిల్లా వ్యాప్తంగా 469 పంచాయతీలు ఉండగా, 20 పీహెచ్సీలు, ఒక జిల్లా కేంద్ర దవాఖాన, ఒక ఏరియా దవాఖాన, ఒక సీహెచ్సీ సెంటర్లలో ఇంటింటా జ్వర సర్వే నిర్వహించారు. బృందంలో ఏఎన్ఎం, అంగన్వాడీ టీచర్, ఆశకార్యకర్త, పంచాయతీ కార్యదర్శి, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు. ఒక్కో టీం 40 నుంచి 50 ఇండ్ల వరకు సర్వే చేస్తున్నాయి. ఇంటింటికీ తిరుగుతూ బాధితులకు జ్వరం, దగ్గు, జలుబు ఉన్నా యా అని ఆరా తీస్తున్నారు. జలుబు, దగ్గు ఉంటే కిట్లను అందజేస్తున్నారు. ఉదయం 9 గంటలకే ఇండ్లల్లోకి చేరుకొని సర్వే నిర్వహిస్తున్నారు.
కరోనా లక్షణాలు కనిపిస్తే మందులు వాడాలి
సంగారెడ్డి, జనవరి 22 : కరోనా లక్షణాలు ఉన్నవారికి మందులు పంపిణీ చేసి, ఐదు రోజు లు వాడాలని సూచించాలని సంగారెడ్డి అదనపు కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శనివారం సంగారెడ్డి పట్టణంలో జరుగుతున్న జ్వర సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మా ట్లాడుతూ ఇంటింటి జ్వర సర్వే చేసే సిబ్బందికి పట్టణవాసులు సహకరించాలని కోరారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇంటిం టి జ్వర సర్వే పకడ్బందీగా నిర్వహించాలని అధికారులు, సిబ్బందికి సూచించారు. సర్వేలో ఏదైనా కుటుంబంలో వ్యక్తికి కొవిడ్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించిన వెంటనే హోంఐసొలేషన్ కిట్ అందించి, మం దులు వాడే విధానాన్ని వివరించాలన్నారు. వ్యాధి తీవ్రతను బట్టి అవసరమైన వారిని దగ్గరలోని దవాఖానలో చేర్పించి, వైద్యం అందించాలని సిబ్బందికి సూచించారు.