
సింగవట్నంలో లక్ష్మీనరసింహస్వామి ఆలయం బ్రహ్మోత్సవ శోభను సంతరించుకున్నది. ఆదివారం నుంచి ఈనెల 21వరకు జరిగే ఉత్సవాలకు అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆలయ సిబ్బంది ఏర్పాట్లు పూర్తి చేశారు. నెలరోజుల పాటు జరిగే జాతరకు వివిధరాష్ర్టాల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తారు. స్వామికి తూర్పు దిశన రత్నగిరికొండపై శ్రీలక్ష్మీదేవి కొలువై ఉన్నది. ఇక్కడే స్వామివారికి నిత్యం అభిషేకం,పూజా కైంకర్యాలు జరుగుతాయి. ఇక్కడ స్వామి లింగాకారంలోనే భక్తులకు దర్శనమిస్తుంటారు.
కొల్లాపూర్, జనవరి 14 : తెలంగాణలో ఎంతో ప్రసిద్ధి చెందిన యాదాద్రి పుణ్యక్షేత్రం తరువాత కొ ల్లాపూర్ మండలం సింగవట్నంలో లక్ష్మీనరసింహస్వామికి అంతటి మహిమ ఉన్నదని భక్తులు నమ్ముతారు. ఈనెల 15 నుంచి 21వ తేదీ వరకు సింగవట్నం బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఉ త్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈవో రామశర్మ తెలిపారు. నెలరోజుల పాటు తిరునాళ్లు కొనసాగనున్నాయి. మకర సంక్రమణం అనంతరం జరిగే బ్రహ్మోత్సవాలకు తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ర్టాల నుంచి భక్తు లు అధిక సంఖ్యలో తరలిరానున్నారు. స్వామి వా రికి నిత్యం అభిషేకం, పూజా కైంకర్యాలు కొనసాగుతాయి. లక్ష్మీనరసింహస్వామికి ఒక ఆకారం అం టూలేదు. లింగాకారంలోనే భక్తులకు దర్శనమిస్తుంటారు. అలాగే స్వామి వారికి ఎదురుగా తూర్పు దిశన రత్నగిరికొండపై శ్రీలక్ష్మీదేవి కొలువై ఉన్నది.
చరిత్ర..
పురాణాల ప్రకారం.. ఐదు శతాబ్దాల కిందట సురభి వంశానికి చెందిన 11వ తరం వాడైన సింగమనాయుడనే భూపాలుడు జటప్రోలు కేంద్రంగా ఈ ప్రాంతాన్ని పాలించేవాడు. ఆ సమయంలో ఒక రైతు తన పొలంలో అరక దున్నుతుండగా లింగాకార రూపంలోని శిల నాగలికి అడ్డు తగులుతున్న ది. ఆ శిలను నిత్యం ఒడ్డుకు చేర్చి దున్నేవాడు. మ ళ్లీ ఉదయం వచ్చి చూసే సరికి ఆ శిల పొలంలో ఉం డేది. ఇలా నిత్యం జరుగుతుండడంతో పనికి అంతరాయం కలిగేది. ఆ రాయి మహిమను గుర్తించలేక తనను కరుణించమని దేవుడిని ప్రార్థించాడు. ఒక రాత్రి సింగమనాయుడి కలలో దేవుడు ప్రత్యక్షమై ఉత్తర దిశలో ఉన్న రైతు పొలంలో తాను వెలిశానని, నాగలికి అడ్డుతగులుతున్నా తనను గుర్తించ డం లేదని చెబుతాడు. ఇదే రోజున నడిజాములో తనను గుర్తించి వెంటనే ప్రతిష్ఠించి పూజలు జరపాలని సూచిస్తాడు. కలనా. నిజమా అని తెలుసుకునేందుకు రాజు తన సైన్యంతో రైతు పొలంలో వెతకగా.. లింగం రూపంలో వెలిగిపోతున్న శిల కనిపించిందట. కలలో చెప్పిన పోలికలన్నీ ఉండడంతో.. లింగాన్ని అభిషేకించి ప్రతిష్ఠించారని కథనం. స్వా మి వారికి ఎండతగలకుండా నాపరాయి, మట్టితో అప్పుడు చిన్నగుడిని నిర్మించారు.
బ్రహ్మోత్సవాల వివరాలు..
సింగవట్నం క్షేత్రంలో ప్రతి ఏడాది పుష్య మా సంలో ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ మేరకు ఈ నెల 15న శనివారం శకటోత్సవం, పల్లకీ సేవ, 16న సాయంత్రం మోహినీ అలంకర ణ, రాత్రి 8 గంటలకు కల్యాణం, 17న రాత్రి 7 గంటలకు ప్రభోత్సవం, 18న సాయంత్రం 4 గం టలకు రథోత్సవం (తేరు), 19న ఉదయం 10 గం టలకు రత్నలక్ష్మీ అమ్మవారికి అభిషేకం, రాత్రి 7 గంటలకు స్వామివారికి పుష్కరిణిలో తెప్పోత్సవం, 20న శేషవాహన సేవ, మంగళహారతి, 21న సాయంత్రం 6 గంటలకు శ్రీవారిసముద్రంలో హంసవాహన సేవ కార్యక్రమాలు ఉంటాయి. వనపర్తి, కొల్లాపూర్, గద్వాల, నాగర్కర్నూల్ డిపోల నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతారు.