వనపర్తి, జనవరి 22 : ఆపదలో ఉన్న మహిళలను ఆదుకునేందుకు పోలీస్ శాఖ అప్రమత్తమైంది. డయ ల్ 100 మంచి ఫలితాలను ఇస్తుండగా.. ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందిస్తుండటంతో క్షణాల్లో బాధితులకు న్యాయం జరుగుతున్నది. అయితే డయల్-100కు ఎక్కువగా మహిళల ఫిర్యాదు వస్తుండడంతో షీటీమ్స్ కు అనుసంధానం చేస్తూ పోలీసులు తాజాగా క్యూఆర్ కోడ్‌ను అందుబాటులోకి తెచ్చింది. మహిళలు, యువతులు, బాలికలు స్మార్ట్‌ఫోన్‌లో పోస్టర్‌పై ఉన్న ఈ కోడ్‌ను స్కాన్ చేసి వివరాలు నమోదు చేస్తే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు అందుతుంది. అక్కడి సిబ్బంది అవసరమైన సాయాన్ని అందిస్తారు. గతేడాది ఏప్రిల్ 19న వనపర్తి ఎస్పీ అపూర్వారావు తన సిబ్బందితో కలిసి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈ కోడ్‌కు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు.
ఐదు నిమిషాల్లో స్పందన..
డయల్ 100 ఫిర్యాదులపై పోలీసులు వెంటనే స్పం దిస్తున్నారు. ముందుగా ఫోన్‌కాల్ కంట్రోల్ రూమ్‌కి వెళ్లి అక్కడి సిబ్బంది సంబంధిత పోలీస్ స్టేషన్‌కు చేరవేస్తారు. వెంటనే స్టేషన్ ఎస్‌హెచ్‌వో వివరాలను నమో దు చేసుకుని క్షణాల్లో ఘటనా స్థలానికి చేరుకుంటారు. అనంతరం అందుకు సంబంధించిన పరిష్కార వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తారు.
కోడ్ పనిచేసే విధానం..
తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ బాషల్లో ఉన్న పోస్టర్లను ఆర్టీసీ బస్సులు, రైల్వే స్టేషన్లు, వంటి ముఖ్య కూడళ్లు, ఇతర ప్రాంతాల్లో అతికిస్తారు. జిల్లాలో ఎవరైనా బాధిత మహిళలు షీటీంకు ఫిర్యాదు చేయాలనుకున్నప్పుడు ముందుగా వారి ఫోన్‌తో ఆ పోస్టర్‌పై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి. అలా స్కాన్ చేసినప్పుడు http://qr.tspolice.gov.in అనే లింక్ వస్తుంది. దీన్ని క్లిక్ చేయగానే ఫిర్యాదు ఫోరం ఓపెన్ అవుతుంది. అందులో పేరు, లొకేషన్ తదితర వివరాలు పూరించి సబ్మిట్ చేయాలి. ఆ వివరాలు వెంటనే షీ టీమ్ సాఫ్ట్వేర్ ఐటీ విభాగానికి చేరుతాయి. అక్కడి సిబ్బంది ఆన్లైన్ అప్లికేషన్ లొకేషన్ ఆధారంగా సంబంధిత పోలీస్ స్టేషన్‌కు చేరుతుంది. అనంతరం ఫిర్యాదుపై చేపట్టిన చర్యల వివరాలను తిరిగి ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది. అన్ని వివరాలు గోప్యంగా ఉంచుతారు.
ఫిర్యాదుతో సాయం పొందండి
బాధిత మహిళలకు వారి ఫోన్ ద్వారానే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి ఎక్కడి నుంచైనా ఆన్లైన్లో ఫిర్యా దు చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. క్యూఆర్ కోడ్ ద్వారా వచ్చిన ఫిర్యాదును ఐటి సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షించి దగ్గరలోని పోలీస్‌స్టేషన్‌కు స మాచారం అందించి చర్యలు తీసుకుంటారు. షీ టీం కు ఫిర్యాదు చేయదలుచుకునే మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. వివరాలు గోప్యంగా ఉంచబడుతాయి.