
మాగనూర్, జనవరి 20 : మండలంలోని లక్ష్మీపురం భూముల అక్రమాలు ఆలస్యంగా వెలుగులో కి వచ్చాయి. డిప్యూటీ తాసిల్దార్ సంతకం ఫోర్జరీ చే సి నో.పీటీ రికార్డులో కూడా వివరాలు మార్చారు. స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో గతేడాది సెప్టెంబర్ 20వ తేదీన నో.పీటీ కోసం చిట్యాల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి దరఖాస్తు పెట్టుకున్నాడు. కా గా, అధికారులు దరఖాస్తును పరిశీలించి.. లక్ష్మీపూ ర్ శివారులోని సర్వేనెంబర్ 47, 48లో ఉన్న 18 ఎకరాల భూమి పీటీ రికార్డును చూసి కరెక్ట్‌గా లేనందున రిజెక్ట్ చేసినట్లు సమాచారం. అయితే, గతేడాది డిసెంబర్ 23, 24వ తేదీల్లో డీటీ సెలవుల్లో ఉండడంతో.. పీటీ రికార్డు తీసి 2018లో డీటీగా ఉన్న శ్రీనివాస్‌రెడ్డి (సరెండర్ అయ్యారు) సంతకాన్ని సదరు పీటీదారుడు చేశాడు. కానీ, ప్రస్తుతం ఉన్న డీటీ అమీర్ 22 డిసెంబర్ 2021న నో.పీటీ సర్టిఫికెట్లో ఇచ్చినట్లు ఉండడం గమనార్హం. రెవెన్యూ సిబ్బందిలో ఒకరికి వాట్సాప్ చేసి నో.పీటీ ఇచ్చింది వాస్తవమా కాదా.. చూసి చెప్పాలని ఓ వ్యక్తి అడగడంతో.. సదరు అధికారి డీటీ దగ్గరకు వెళ్లి సర్టిఫికెట్ చూపించడంతో ఆయన ఆశ్చర్యపోయాడు. తాను రిజెక్ట్ చేసిన ఫైల్ కు సర్టిఫికెట్ ఎలా ఇస్తాను అన్న అనుమానంతో రికార్డులను పరిశీలించాడు. దీంతో పీటీ రిజిస్టర్లో ఎవరో తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని గుర్తించి కలేక్టరేట్‌లో ఫిర్యాదు చేసినట్లు డీటీ అమీర్ తెలిపారు. కలెక్టరేట్ నుంచి మాగనూర్ తాసిల్దార్ తిరుపతయ్య, డీటీ అమీర్, సీనియర్ అసిస్టెంట్ సురేశ్, సత్యనారాయణలకు మెమోలు జారీ చేశారు. తాసిల్దార్ కార్యాలయంలో సీసీ ఫుటేజ్‌ను కలెక్టరేట్‌కు పంపినట్లు సమాచారం. కాగా, ఫోర్జరీ చేశారనే అనుమానంతో డీటీ అమీర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెవెన్యూ సి బ్బంది హనుమంతు, వెంకటయ్య, సత్యనారాయ ణ, భూమి స్వాధీనం చేసుకోవాలనుకున్న రహమ త్ పాషాపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శివ నాగేశ్ తెలిపారు. త్వరలో విచారణ చే స్తామని ఎస్సై పేర్కొన్నారు.