Bike theft | తాగిన మైకం..పోయిన బైక్…

అమీర్‌పేట్ : మద్యం మత్తులో కింద పడిపోయిన వ్యక్తికి చేయూతనందించాల్సింది పోయి.. అతని ద్వీచక్ర వాహనం, సెల్‌ఫోన్‌తో ఉడాయించిన ఘటన సనత్‌నగర్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
బాలానగర్ ప్రాంతానికి చెందిన శేఖర్ (40) మద్యం సేవించి తన ద్విచక్ర వాహనంపై బల్కంపేట నుండి ఫతేనగర్ ఫ్లై ఓవర్ మీదుగా వెళుతున్నాడు. కాగా ఫ్లై ఓవర్ మీదకు రాగానే బ్యాలెన్స్ ఆగక వాహనం పై నుండి కింద పడిపోయాడు. అదే అదనుగా గుర్తు తెలియని వ్యక్తి అతని ద్విచక్ర వాహనం ప్యాషన్ ప్రో, సెల్‌ఫోన్‌తో ఉడాయించాడు.
కొంత సేపటికి విషయం తెలుసుకున్న శేఖర్ జరిగిన ఘటనను సనత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సనత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Districts-localnews News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

