Jubilee Hills Housing Society |జూబ్లీహిల్స్ సొసైటీ కార్యదర్శిపై అవిశ్వాసం చెల్లదు.. ట్రిబ్యునల్ తీర్పు

బంజారాహిల్స్ : జూబ్లీహిల్స్ కో అపరేటివ్ హౌజ్ బిల్డిండ్ సొసైటీ కార్యదర్శిగా ఏ.మురళీ ముకుంద్‌ను కొనసాగించాల్సిందే అని తెలంగాణ కో ఆపరేటివ్ ట్రిబ్యునల్ గురువారం తీర్పును వెలువరించింది. దీంతో గత కొన్ని నెలలుగా జూబ్లీహిల్స్ సొసైటీలో తలెత్తిన వివాదానికి తెరపడినట్లయింది.
ఆరునెలల క్రితం జూబ్లీహిల్స్ సొసైటీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన రవీంద్రనాథ్ ప్యానెల్లో విభేదాలు తలెత్తాయి. సొసైటీ కార్యదర్శి మురళీముకుంద్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన మేనేజింగ్ కమిటీ ఆయనను పదవినుంచి తొలగిం చింది. అయితే మేనేజింగ్ కమిటీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్యదర్శి మురళీముకుంద్ కో అపరేటివ్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు.
సహకార చట్టం నిభందనల ప్రకారం సొసైటీ కార్యదర్శిపై అవిశ్వాసం పెట్టేందుకు అవకాశం లేనందున మురళీముకుంద్ను తిరిగి నియమిస్తూ గురువారం తీర్పును వెలువరించింది. సొసైటీ సభ్యుల మధ్య ఉన్న విభేదాల కారణంగానే తనపై అవిశ్వాసం ప్రవేశపెట్టారని, ట్రిబ్యునల్ తీర్పుతో తనకు న్యాయం జరిగిందని మురళీ ముకుంద్ తెలిపారు. సభ్యులందరితో కలిసి సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తామని పేర్కొన్నారు.
Read Today's Latest Districts-localnews News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

