క్రిస్మస్ వేడుకలను సంతోషంగా నిర్వహించుకోవాలి
క్రైస్తవ పేదలందరికీ కానుకలందేలా చూడాలి
షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్
షాద్నగర్, డిసెంబర్ 17: క్రిస్మస్ పండుగను క్రైస్తవ సోదరులు సంతోషంగా నిర్వహించుకోవాలని షాద్నగర్ ఎమ్మె ల్యే అంజయ్యయాదవ్ అన్నారు. శుక్రవారం ఆయన షాద్నగర్ పట్టణంలోని మండల పరిషత్ సమావేశ మందిరంలో క్రైస్తవులకు క్రిస్మస్ కానుకలను పంపిణీ చేసి మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల పండుగలకు సీఎం కేసీఆర్ ప్రభు త్వం సముచిత గౌరవం ఇస్తున్నదన్నారు. క్రైస్తవ పేదలందరికీ ప్రభుత్వ కానుకలు అందేలా చూడాలన్నారు. కార్యక్రమం లో ఎంపీపీ ఖాజాఇద్రీస్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నటరాజన్, నాయకులు నవీన్, చర్చిల పాదర్స్, మత పెద్దలు, గ్రామీణ ప్రాంతాలకు చెందిన క్రైస్తవులు పాల్గొన్నారు.
కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
నందిగామ, డిసెంబర్ 17: పేదింటి ఆడబిడ్డల తల్లిదండ్రుల కు కల్యాణలక్ష్మి పథకం ఆర్థికంగా భరోసా ఇస్తున్నదని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. శుక్రవారం ఆయన మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో జరిగిన కార్యక్రమంలో మండలంలోని పలు గ్రామాలకు చెం దిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి పథకం ద్వారా మంజూరైన 49 చెక్కులను ఎంపీపీ ప్రియాంకగౌడ్తో కలిసి అందజేశా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని వాటిని అర్హు లు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో రాష్ట్రంలోని అన్ని గ్రామాల రూపురేఖలు మారిపోయినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీలు, నాయకులు పాల్గొన్నారు.