వ్యవసాయ యూనివర్సిటీ : సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోనే తెలంగాణలో ముస్లీమ్‌లు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్నారని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. శుక్రవారం టీఆర్ఎస్ కార్యాలయంలో సులేమాన్ నగర్‌కు చెందిన హుస్సెన్ఖాన్ , అబ్ఢుల్ రహీమ్ కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనార్టీలు ప్రధానంగా ముస్లీమ్‌లలో రాష్ట్ర ఏర్పాటు అనంతరం అనేక మార్పులు వచ్చాయన్నారు. సాంఘీక, ఆర్థికంగా ఎదుగుదలకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. సులేమాన్ నగర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు షేక్ నయ్యూమోద్ధీన్ మాట్లాడుతూ ముస్లీం మహిళలు గతంలో ఒంట ఇంటికే పరిమితమైయ్యేవారని , ప్రస్తుతం రాజకీయంగా ముందుకు వస్తున్నారని గుర్తుచేశారు.
గతంలో ఎన్నడూ ముస్లీంల గూర్చి పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. కేసీఆర్ ముందుచూపుతో అన్ని రంగాల ప్రజలకు ప్రాదాన్యత ఇస్తూ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తున్నారన్నారు. డివిజన్లో ఉద్యమ సమయంలో కేవలం 10 మందితో ప్రారంభమైన ప్రస్థానం నేడు వేలాధి మంది కార్యకర్తలు ఉన్నారన్నారు.
డివిజన్ అధ్యక్షురాలు సనామేడం మాట్లాడుతూ గతంలో ముస్లీం మహిళలు ఒంట్టింటికే పరిమిత మైయ్యేవారన్నారు. తెలంగాణ ప్రభుత్వం మహిళలను ప్రధానంగా మైనార్టీలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కార్యదర్శిగా సైనాజ్ బేగం, ప్రధాన కార్యదర్శి రజియాభేగం, షేక్ బాబా , ఎండీ స్సేన్ , భాను, ఫర్జానా తదితరులు పాల్గొన్నారు.