
దేవరకద్ర రూరల్, జనవరి 19: చింతకుంట శివారులోని ఊకచెట్టు వాగులో చెక్‌డ్యాం, కాజ్వే నిర్మాణం, కు రుమూర్తి ఆలయం వరకు బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టడం తో చింతకుంట ప్రజల చిరకాల స్వప్నం నెరవేరుతున్నదని ఆబ్కారీ, క్రీడలు, పర్యాటకశాఖ మంత్రి డాక్టర్ శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. బుధవారం చిన్న చింతకుంట మండలంలోని వాగులో రూ. 41 కోట్ల తో చెక్‌డ్యాం, కాజ్వేతోపాటు అక్కడినుంచి కురుమూర్తి ఆలయం వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనుల శంకుస్థాపన కు మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్, శాట్ చైర్మన్ అల్లీపూర్ వెంకటేశ్వర్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వాగు దగ్గర ప్రత్యేక పూజ లు నిర్వహించి పనులు ప్రారంభించారు. అంతకుముందు చింతకుంట మండలానికి చెందిన మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.2 కోట్ల 20 లక్షల చెక్కును అందజేశారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో గతంలో 14 లక్షల మంది వలస వెళ్లేవారు, రాష్ట్ర సాధన అనంతరం కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక రైతాంగం అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు చేపట్టడంతో వలసవెళ్లినవారు తిరిగొచ్చి వారి పొలాల్లో వ్యవసాయం చేసుకుంటూ ఇతరులకు పనికల్పిస్తున్నారన్నారు. గతంలో 70 ఏండ్లుగా వెనుక బ డిన తెలంగాణను 7 ఏండ్లలో అభివృద్ధ్ది చేసి చూపించామన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇతర పార్టీ నాయకులు అవాకులు చవాకులు మాట్లాడుతూ అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నంతవరకు ఏ సంక్షేమ పథకాలూ ఆగవని, మరిన్ని సంక్షే మ పథకాలు చేపట్టి అభివృద్ధ్ది పథంలో నడిపిస్తారన్నారు.
నాటి బీళ్లు..నేడు పచ్చని పంటపొలాలు
అనంతరం గిడ్డంగుల చైర్మన్ సాయిచంద్ మాట్లాడుతూ గతంలో ఉన్న బీడుభూములన్నీ ఇప్పుడు పచ్చని పంటపొలాలతో కళకళలాడుతున్నాయని పాట రూపంలో పాడి వినిపించారు. రాష్ట్ర సాధన తరువాత నీళ్లు, నిధులు, నియామకాలు చేపట్టినట్లు తెలిపారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ర్టాన్ని అభివృద్ధ్ది పథంలో నడిపిస్తూ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో తెలంగాణను నిలబెట్టారన్నారు. ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ ముఖ్యమంత్రి చొరవతో ఊకచెట్టు వాగులో 21 చెక్‌డ్యాంలు నిర్మించినందుకు ఒక్కో చెక్‌డ్యాం దగ్గర రెండు కిలోమీటర్ల మేర నీరు నిల్వ ఉంటుందని, భూగర్బ జలాలు పుష్కలంగా అభివృద్ధ్ది చెందాయన్నారు. ఎడారిగా ఉన్న వాగులు ఇప్పుడు జీవనదులుగా మారాయన్నారు. ఉచిత కరెంటు, రైతుబంధు, రైతుబీమా, ధాన్యం కొనుగోలు వంటి కార్యక్రమాలు చేపట్టడంతో రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. దీనికంతటికీ కారణం కేసీఆర్ ముఖ్యమంత్రి కావడమే నన్నారు. తెలంగాణలో మినహా దేశంలో, ప్రపంచంలోనే రైతులకు నేరుగా సాయం చేసే ప్రభుత్వం లేదన్నారు. ఇన్ని చేస్తున్న ముఖ్యమంత్రికి మనం ఎప్పుడూ రుణపడి ఉండాలని పేర్కొన్నారు. అనంతరం అల్లీపూర్ గ్రామంలో రూ. కోటీ 29 లక్షలతో నిర్మించిన అల్లీపూర్ ఇందిరమ్మ స్మారక మినీ ఇండోర్ బ్యాడ్మింటన్ స్టేడియంను ప్రారంభించారు. అనంతరం మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ, చైర్మన్ కొద్దిసేపు బ్యా డ్మింటన్, బాస్కెట్‌బాల్ ఆడారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్‌పవార్, ఎంపీపీ హర్షవర్ధన్‌రెడ్డి, జెడ్పీటీసీ రాజేశ్వరి,పార్టీ మండల అధ్యక్షు డు కోట రాము, జిల్లా రైతుబంధు సభ్యులు కరుణాకర్‌రెడ్డి, పీఏసీఎస్ అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి, ఉమామహేశ్వర్‌రెడ్డి, ఎంపీటీసీ ఉషారాణి తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.