ఎర్రగడ్డ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా అభివృద్దే ప్రధాన ఎజెండాగా పని చేస్తూ ముందుకు వెళ్లటం జరుగుతుందని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. ఎర్రగడ్డలో రూ.25 లక్షలతో చేపట్టిన తాగునీటి, సివరేజీ పైప్‌లైన్ పనులకు ఆయన సోమవారం శంకుస్థాపన చేశారు.
సదరు పనులకు సంబంధించిన శిలాఫలకాలను సంజయ్‌నగర్, శంకర్‌లాల్‌నగర్, నేతాజీనగర్లలో కార్పొరేటర్ షాహీన్బేగంతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గోపీనాథ్ మాట్లాడుతూ ప్రతి బస్తీకి మెరుగైన వసతుల కల్పన ధ్యేయంగా పలు అభివృద్ధి పనులను పూర్తి చేయటం జరిగిందన్నారు.
నియోజకవర్గంలో వెనుకబడ్డ ఎర్రగడ్డ, రహ్మత్‌నగర్ డివిజన్ల రూపురేఖలు పూర్తిగా మారిపోయిన వైనాన్ని ప్రజలు చూస్తు న్నారని, అభివృద్ధిని చూసి ఓర్వలేని వాళ్ల మాటలను నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరని పేర్కొన్నారు. ఎర్రగడ్డ డివిజ న్కు ఇప్పటికే కోట్లాది రూపాయలను కేటాయింపజేసి రోడ్లు, కమ్యూనిటీహాళ్లు, పైప్‌లైన్ పనులను పూర్తి చేశామన్నారు.
పేద ప్రజలు అధిక సంఖ్యలో నివశిస్తున్న ఈ ప్రాంతంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు ఆశించిన స్థాయికన్నా ఎక్కువగా ఉన్నదన్నారు. కార్యక్రమంలో జలమండలి మేనేజర్ శివ, మాజీ కార్పొరేటర్ మహ్మద్‌షరీఫ్, డివిజన్ అధ్యక్షుడు డి.సంజీవ, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.