గోల్నాక : ఆనారోగ్యానికి గురై పలు దవాఖానాల్లో చికిత్స పొందుతున్న బాధితులకు ఆపదలో సీఎం రిలీఫ్ ఫండ్ అండగా నిలుస్తోందని ఎమ్మెలే కాలేరు వెంకటేశ్ అన్నారు.
సోమవారం గోల్నాకలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన 12 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్‌ఫండ్ నుంచి మంజూరైన రూ.4,82,500 విలువగల చెక్కులను ఆయన అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్యానికి గురై పలు దవాఖానాల్లో చికిత్స పొందుతున్న అర్హులైన ప్రతి ఒక్క రికీ సీఎం రిలీఫ్‌ఫండ్ నుంచి ఆర్థికసాయం అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.