ఎల్బీనగర్ : హైదరాబాద్ పర్యాటక రంగానికి మరో ఆకర్షణ జతకలిసింది. సరూర్‌నగర్ మినీ ట్యాంక్‌బండ్‌లో బోటు షికారు ప్రారంభమయ్యింది. సరూర్‌నగర్ మినీ ట్యాంక్‌బండ్, ఇందిరా ప్రియదర్శినీ పార్కును సందర్శించే ప్రజలకు చెరువులో విహారించే అవకాశం కల్పిస్తూ తెలంగాణ టూరిజం విభాగం బోటు షికారును ప్రారంభించింది.
అందులో భాగంగా గురువారం ఉదయం సరూర్‌నగర్ మినీ ట్యాంక్‌బండ్‌లో బోట్‌ను రాష్ట్ర పర్యాటక, క్రీడాశాఖా మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సరూర్‌నగర్ చెరువుకు పర్యాటక సొబగులు అద్దే క్రమంలో బోటు షికారును ప్రారంభించినట్లుగా ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ది చేసి అన్ని విధాలుగా అందుబాటులోకి తెస్తామన్నారు.
అనంతరం ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డితో పాటు ఎమ్మెల్సీలు యెగ్గె మల్లేశం కురుమ, బొగ్గారపు దయానంద్ గుప్తా, టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, పరిశ్రమల అభివృద్ది కార్పొరేషన్ ఛైర్మన్ అమరవాది లక్ష్మీనారాయణలతో కలిసి మినీ ట్యాంక్‌బండ్‌లో విహరించారు.
ఈ కార్యాక్రమంలో కార్పొరేటర్లు దరిపల్లి రాజశేఖర్‌రెడ్డి, ఆకుల శ్రీవాణి, టూరిజం విభాగం అధికారులు పాల్గొన్నారు.