ఖలీల్‌వాడి, జనవరి 12 : పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించి..నియమ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన బీజేపీ నగర మాజీ ఉపాధ్యక్షుడు కరిపె గణేశ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి ఆయనను తొలగించారు. ఈ మేరకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య, ప్రధాన కార్యదర్శి పోతన్కర్ లక్ష్మీనారాయణ బుధవారం ఈ ఒక ప్రకటన విడుదల చేశారు.