
కోయిలకొండ/జడ్చర్ల(బాలానగర్), జనవరి 17 : కోయిలకొండ, బాలానగర్ మండలకేంద్రాల్లో నూతనంగా నిర్మించిన దవాఖానల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యా యి. మంగళవారం వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు దవాఖానలను ప్రారంభించనున్న నేపథ్యంలో సోమవారం అదనపు కలెక్టర్లు తేజస్ నందలాల్ పవార్, సీతారామారావు ఏర్పాట్లను పరిశీలించారు. కోయిలకొండలో రూ.6కోట్లతో నిర్మించిన ప్రభుత్వ దవాఖాన ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు. కోయిలకొండలో దవాఖాన ప్రారంభోత్సవ ఏ ర్పాట్లను పరిశీలించిన అనంతరం అధికారులతో సమీక్ష ని ర్వహించారు. వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు, ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి కోయిలకొండ దవాఖానను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. దవాఖాన ప్రారంభోత్సవంలో పాల్గొనే ప్రతిఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ కృష్ణయ్య, డిప్యూటీ డీఎంహెచ్‌వో శశికాం త్, డాక్టర్ చంద్రశేఖర్, తాసిల్దార్ ప్రకాశ్, ఎంపీడీవో జ యరాం, ఎంపీవో నసీర్‌అహ్మద్ పాల్గొన్నారు. అదేవిధంగా బాలానగర్‌లో 30 పడకల ప్రభుత్వ దవాఖాన ప్రారంభోత్సవ ఏర్పాట్లను అదనపు కలెక్టర్ సీతారామారావు పరిశీలించారు. దవాఖానలో రోగులకోసం ఏర్పాటు చేసిన వసతు లు, బెడ్లు తదితర వివరాలను తెలుసుకున్నారు. వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు దవాఖానను ప్రారంభిస్తారని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేయాలని వైద్యాధికారులు, సిబ్బందికి సూచించారు. దవాఖానలో ఎక్స్‌రే, స్కానింగ్, ఈసీజీ వైద్యపరికరాల ఏర్పాటుపై సూచనలు, సలహాలు ఇచ్చారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో కృష్ణ, దవాఖాన ఇన్చార్జి డాక్టర్ సోమశేఖర్, పీహెచ్సీ వైద్యురాలు సృజన తదితరులు పాల్గొన్నారు.