
దేవరకద్ర రూరల్, జనవరి 14 : కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలతో అన్నదాతలు ఆగమవుతున్నారని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నా రు. చిన్నచింతకుంటలో శుక్రవారం ఏర్పాటు చేసిన వి లేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎరువుల ధరలను పెంచి రైతులపై పెనుభారం మోపిందన్నారు. పెంచిన ఎరువుల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షం లో రైతులే తగిన బుద్ధి చెబుతారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుండగా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్నదాతల నడ్డి విరిచేలా ధరలను పెంచుతున్నదని ధ్వజమెత్తారు. గడిచిన ఏడేండ్లలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ రైతులకు పనికొచ్చే పనులు ఏం చేశారో చెప్పాలన్నారు. ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్న బీజే పీ నాయకులకు తగిన గుణపాఠం తప్పదన్నారు.
రూ.41కోట్లు మంజూరు
చిన్నచింతకుంట ఊకచెట్టు వాగులో కాజ్వే, జాతరగుట్టపైకి బీటీరోడ్డు నిర్మాణానికి రూ.41కోట్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే ఆల తెలిపారు. 19న మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డిచే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు. కాగా, దేవరకద్రలో బోయ హరీశ్ స్మారక క్రికెట్ టోర్నీ ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన ర క్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం దేవరకద్ర, డోకూర్ జట్ల మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్‌కు టాస్ వేశారు. అలాగే చిన్నచింతకుంట మండలం పర్ధీపూర్లో స్వామి వివేకానంద జయంతి, యువజనోత్సవాన్ని పురస్కరించుకుని రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అలాగే గ్రామ యువతకు క్రికెట్ కిట్ అందజేశారు. అనంతరం వాలీబాల్ టోర్నీని ప్రారంభించారు. అదేవిధంగా నెల్లికొండి నల్లగుట్టతండాకు చెందిన టీఆర్ఎస్ కార్యకర్త రాందాస్‌నాయక్ ఇటీవల మృతి చెంద గా, అతడి కుటుంబసభ్యులకు రూ.2లక్షల పార్టీ సభ్య త్వ ఇన్సూరెన్స్ చెక్కును అందజేశారు. అనంతరం నెల్లికొండిలో మాతా మాణికేశ్వరి, బ్రహ్మర్షి పత్రిజీ మా ర్గదర్శకంలో నిర్వహించిన సంక్రాంతి సంబురాల్లో ఎమ్మె ల్యే పాల్గొన్నారు. చిన్నచింతకుంట మండలం ఏదులాపూర్‌లో రూ.5లక్షలతో చేపట్టనున్న డ్రైనేజీ నిర్మాణానికి భూమిపూజ చేశారు. అదే గ్రామానికి చెందిన శివరాములుకు రూ.25వేలు, చిన్నయ్యకు రూ.5వేల ఆర్థికసా యం అందజేశారు. కార్యక్రమంలో శాట్ చైర్మన్ అల్లీపూర్ వెంకటేశ్వర్‌రెడ్డి, ఎంపీపీ హర్షవర్ధన్‌రెడ్డి, జెడ్పీటీసీలు రాజేశ్వరి, రాజశేఖర్‌రెడ్డి, ఎంపీటీసీ ఉషారాణి, సర్పంచ్ మోహన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.