
ఊట్కూర్, జనవరి 20 : కరోనా కేసులు పెరుగుతున్నందున అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆర్ఎస్ఎస్ జిల్లా ప్రచారక్ కేశవరావు అన్నారు. గురువారం మండలకేంద్రంలో ఆయన బూస్టర్ డోస్ వేయించుకున్నారు. ఒ మిక్రాన్, కరోనా బారిన పడకుండా ప్రతిఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని, బయటకు వెళ్లే సమయంలో వి ధిగా మాస్కులు ధరించాలన్నారు. కార్యక్రమంలో ఏఎన్ ఎం శైలజ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
టీకా వేసుకోవాలి
కృష్ణ, జనవరి 20 :15 -18 ఏండ్లు గల పిల్లలందరూ తప్పక టీకా వేయించుకోవాలని మెడికల్ ఆఫీసర్ శ్రీమంత్ అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో గురువారం కొ విడ్ టీకా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులందరూ టీకా తీసుకోవాలని, రెండో డోస్ వేసుకున్న వారు తొమ్మిదినెలలు పూర్తయిన ప్రతిఒక్కరూ బూస్టర్ డోస్ టీకా వేసుకోవాలని కో రారు. ప్రతిఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలన్నారు.
ముమ్మరంగా వ్యాక్సిన్ టీకాలు
మక్తల్ రూరల్, జనవరి 20 : మండలంలో వ్యాక్సినేష న్ కార్యక్రమం జోరుగా కొనసాగుతున్నది. ప్రస్తుతం కరో నా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండడంతో ప్రభుత్వం ప్ర త్యేక చర్యలు చేపట్టింది. పట్టణంలోని ప్రభుత్వ దవాఖాన లో గురువారం టీకాలు వేశారు. మొదటి డోస్ తీసుకున్న వారికి రెండో డోస్, రెండో డోస్ తీసుకొని తొమ్మిదినెలలు గడిచిన వారికి బూస్టర్ డోస్ వేస్తున్నట్లు కర్ని పీహెచ్సీ ఇ న్చార్జి సిద్ధప్ప అన్నారు. 15-18 ఏండ్ల లోపు పిల్లలకు టీ కాలు వేయడం జరుగుతుందన్నారు. గ్రామాల్లో ప్రజలు క రోనాపై అప్రమత్తంగా ఉండాలని, తప్పనిసరిగా కొవిడ్ ని బంధనలను పాటించాలని సిద్ధప్ప పేర్కొన్నారు. కార్యక్రమంలో డాక్టర్లు తిరుపతి, శ్రీకాంత్, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.