మక్తల్ అర్బన్, మార్చి 11: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి పాలకుల అసమర్థతతో వెనుకబడిన మక్తల్ పట్టణం.. తెలంగాణ ఏర్పాటు తర్వాత రూపురేఖలు మారాయి. ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి చొరవతో 2018లో మున్సిపాలిటీగా రూపాంతరం చెందింది. సీఎం కేసీఆర్ మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించడంతో ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోని మక్తల్ మున్సిపాలిటీలో ప్రగతి పనులు పరుగులు పెట్టాయి. అంబేద్కర్ సర్కిల్, బస్టాండ్ ఎదుట ఐ లవ్ మక్తల్ లైటింగ్ పోడియం, రోడ్ల విస్తరణ, డ్రైనేజీల నిర్మాణం చేపట్టడంతో పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మక్తల్ పట్టణం 2018 ఆగష్టు 2న మున్సిపాలిటీగా ఆవిర్భవించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మక్తల్ మున్సిపాలిటీకి ప్రభుత్వం పట్టణ ప్రగతిలో భాగంగా నెలకు రూ.12లక్షలను అభివృద్ధి పనులకు కేటాయించింది. పట్టణ ప్రగతి నిధులతో మక్తల్ మున్సిపాలిటీలో సమీకృత మార్కెట్, మున్సిపాలిటీ సమావేశ భవనం, డంపింగ్‌యార్డు, మియావకి(చిట్టడవి), గార్లపల్లిలో పార్క్, నేషనల్ హైవేపై మీడియం ప్లాంటేషన్, బస్టాండ్ ఆవరణలో లైటింగ్ పోడియం( ఐ లవ్ మక్తల్ )తోపాటు అద్దంలా సీసీరోడ్లు, డ్రైనేజీలు నిర్మించారు. ఎమ్మెల్యే చిట్టెం సహకారంతో ప్రత్యేక నిధులు రూ.2కోట్లతో ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్‌వెజ్ మార్కెట్, రూ.కోటితో వైకుంఠధామం నిర్మాణం చేపడుతున్నారు. ఇవేకాకుండా టీయూఎఫ్ఐడీసీ కింద రూ.5కోట్లతో మున్సిపాలిటీలో మూడు కిలోమీటర్ల మేర సీసీరోడ్డు నిర్మాణం, 2.842 కిలో మీటర్ల డ్రైనేజీ నిర్మాణ పనులు చేపడుతున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో మక్తల్ పట్టణం అభివృద్ధికి నోచుకోక మారుమూల ప్రాంతంగా ఉండేది. తెలంగాణ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి చొరవతో మున్సిపాలిటీగా మార్చారు. మున్సిపాలిటీగా ఏర్పడిన తర్వాత బీజేపీ మున్సిపల్ చైర్మన్ ఉన్నా ఎమ్మెల్యే చిట్టెం సహకారంతో మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు చేశారు.
– పసుల విష్ణువర్ధన్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు
పట్టణ ప్రగతి నిధులతో మున్సిపాలిటీలో మున్సిపల్ సమావేశ భవనం, డంపింగ్ యార్డు, సమీకృత మార్కెట్, మియావకి, పార్క్ నిర్మాణం, మీడియం ప్లాంటేషన్, లైటింగ్ పోడియం, మినీ ట్యాంక్‌బండ్ వంటి పనులు చేపట్టారు. ఎమ్మెల్యే సహకారంతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్, వైకుంఠధామం పనులు జరుగుతున్నాయి.
– నాగశివ, ఏఈ మక్తల్ మున్సిపాలిటీ
ఉమ్మడి రాష్ట్రంలో మక్తల్‌కు తెలంగాణ ఏర్పడిన తర్వాత మక్తల్‌కు చాలా మార్పులు వచ్చాయి. ఆహ్లాదకరమైన రోడ్లు, ప్లాంటేషన్, బస్టాండ్ సర్కిల్లో ఐ లవ్ మక్తల్ లైటింగ్ చూడముచ్చటగా ఉంది, మినీ ట్యాంక్ బండ్‌పై సాయంత్రం పిల్లలతో వెళ్లి చూడడానికి బాగుంది. డంపింగ్ యార్డులో చెత్తవేయడంతో వార్డులు శుభ్రంగా ఉంటాయి.
– బోడ్కె నవీన్‌కుమార్, స్థానికుడు