కుభీర్/దిలావర్పూర్/కుంటాల, మే 1 : తెలంగాణ సర్కారు రాష్ట్రంలోని ప్రతి రైతుకు అన్ని విధాలా అండగా ఉంటున్నదని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి స్పష్టం చేశారు. మండలంలోని ఆయా గ్రామాల్లో చిరుత, పులి దాడుల్లో పశువులను కోల్పోయిన యజమానులకు ప్రభుత్వం నుంచి రూ.2 లక్షల పరిహారం మంజూరైంది. కాగా, తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆ చెక్కులను బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నదన్నారు. రానున్న రోజుల్లో అటవీ ప్రాంతాలు, కలపతో దట్టమైన అడవులను తలపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. దిలావర్పూర్ మండలం నర్సాపూర్ (జీ) మండలంలోని గొల్లమాడ గ్రామానికి చెందిన గైరా చిన్నయ్యకు రూ.10వేలు, శ్రీనుకు రూ.10వేలు, బుర్గుపెల్లి గ్రామానికి చెందిన జాదవ్ విజయ్‌కి రూ.12వేలు, జాదవ్ రెడ్డికి రూ.15 వేలు, అంబుగాం గ్రామానికి చెందిన జాదవ్ సాయిబాబుకు రూ.20 వేలు మంజూరైనట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎస్వో కోటేశ్జాదవ్, ఎఫ్ఆర్వో రాథోడ్ రమేశ్, ఎప్బీవో గంగారం, టీఆర్ఎస్ మండల నాయకులు, గిరిజనులు పాల్గొన్నారు.
కుభీర్, మే 1 : మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన బాధితులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను స్థానిక టీఆర్ఎస్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అందజేశారు. అనారోగ్యానికి గురై కార్పొరేట్ దవాఖానల్లో చేరే పేదవారికి సీఎం సహాయ నిధి ఆరోగ్య ప్రధాయినిగా నిలుస్తున్నదన్నారు. పీ లక్ష్మీప్రసన్న (గోడ్సర)కు రూ.60వేలు, జే ప్రణీత(పాంగ్ర)కు రూ.35 వేలు చెక్కులను అందించారు. కార్యక్రమంలో నాయకులు తూం రాజేశ్వర్, శంకర్ చౌహాన్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు దత్తుగౌడ్, దిగంబర్ పటేల్, శ్యాంరావు, శ్రావణ్ గోడిసెర తదితరులు పాల్గొన్నారు.
ముథోల్, మే 1 : మండలంలోని బోరిగాం, వడ్తాల్, ఎడ్బిడ్, చింతకుంట గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర లభిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే రైతులను ఆదుకునేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అఫ్రోజ్ ఖాన్, బ్రహ్మన్గావ్ సర్పంచ్ రాంరెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ సురేందర్ రెడ్డి, నాయకులు మురళి, బోరిగాం నర్సయ్య, పీఏసీఎస్ సీఈవో సాయరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.
భైంసాటౌన్, మే 1 : మండలంలోని వాటోలి గ్రామంలో శివాలయం, ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే వి ఠల్ రెడ్డి తెలిపారు. దేగాంలో ఇందుకు సంబంధిం చి మంజూరు పత్రాలను ఆలయ కమిటీ చైర్మన్ సచిన్ పాటిల్‌కు అందజేశారు. శివాలయ నిర్మాణానికి రూ.24 లక్షలు, ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.2 లక్షలు మంజూరయ్యాయి. అనంతరం గ్రామస్తులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో నాయకులు వైద్యనాథ్, సాయినాథ్, గ్రామస్తులు పాల్గొన్నారు.