ఆదిలాబాద్, ఏప్రిల్ 28( నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ ప్రభుత్వం 91 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ప్రక్రియలో భాగంగా మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే పోలీసు శాఖలో 16, 027 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా, పోలీసు నియామక బోర్డు ద్వారా ఎక్సైజ్, రవాణాశాఖల్లో 677 ఉద్యోగాల భర్తీకి గురువారం మ రో నోటిఫికేషన్ వెలువడింది.
ఎక్సైజ్ శాఖలో 614 కా నిస్టేబుళ్లు, రవాణాశాఖలో 63 పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వచ్చే నెల 2 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. పోలీసు కొలువుల సాధనలో భాగంగా నిరుద్యోగులు ఇప్పటికే శిక్షణ పొందుతున్నారు. పోలీసు, ఇతర శాఖలతో పాటు స్వయంగా శిక్షణ తీసుకుంటున్నారు. ఉ ద్యోగాల ప్రకటనపై వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభు త్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉద్యోగం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.